
TSPSC Group 1 Cancelled
తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. 503 పోస్టులతో గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్ కారణంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2022లో అప్పటి కమిషన్ 503 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త పోస్టులను మంజూరు చేసింది.