Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు!

Share the news
Earthquake: తైవాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 12 గంటల్లోనే డజన్ల కొద్దీ ప్రకంపనలు!

తైవాన్‌లో మరోసారి Earthquake!

తైపీ, తైవాన్: తైవాన్(Taiwan) లో మరోసారి భారీ భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు సుమారు 80 ప్రకంపనలు సంభవించినట్లుగా తైవాన్ సిస్మోలాజికల్ సెంటర్ డైరెక్టర్ వు చియెన్-ఫు (Wu Chien-fu) తెలిపారు.

తైవాన్ లోని హువాలియన్ తూర్పు కౌంటీలో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. మొదటి భూకంపం 5.5 తీవ్రతతో సంభవించగా.. చివరిది 6.3 తీవ్రతగా నమోదైంది. భూ ప్రకంపనల ధాటికి హువాలియన్‌లోని పలు భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్టు సమాచారం. అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

కాగా, ఈ నెల3వ తేదీన కూడా తైవాన్‌లోని హువాలియన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి 14 మంది మరణించారు. అప్పటి నుంచి వరుసగా 1,000 కంటే ఎక్కువ భూప్రకంపనలు సంభవించాయి. భూకంపాలు రావడానికి అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్‌ వద్ద తైవాన్ ఉండటం వలన ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోంది.

See also  Tuned Mass Damper: తైవాన్ భూకంపం నుండి 1667 అడుగుల ఎత్తైన తైపీ 101ని స్టీల్ బాల్ 'డంపర్' ఎలా రక్షించింది?

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top