Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు!

Share the news
Indian Student Dies: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి: ఈ ఏడాది పదో ఘటన.. ఆందోళనలో తల్లిదండ్రులు!

Another Indian Student Dies

అమెరికా: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి(Indian Student Dies) చెందాడు. ఓహియో(Ohio) రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్‌(Cleveland) లో విద్యను అభ్యసిస్తున్న ‘ఉమా సత్యసాయి గద్దె’(Uma Satya Sai Gadde) అనే విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

భారతీయ విద్యార్థి సత్యసాయి దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధాకరమని.. విద్యార్థి మృతి(Indian Student Dies)పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.. పేర్కొంది.. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. తెలిపింది. అయితే మరణానికి గల కారణాలను కానీ.. సత్యసాయి భారత్‌లోని ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనే విషయాలు కానీ.. స్పష్టం చేయలేదు.

దీనితో.. ఈ ఏడాది (2024 ప్రారంభం నుండి) అమెరికాలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది. తాజా ఘటనతో భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో US లోని ఛార్జ్ డి ఎఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ నేతృత్వంలో నిర్వహించిన వర్చువల్ ఇంటరాక్షన్ లో 90 US యూనివర్శిటీల నుండి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు సీటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్స్ కూడా హాజరయ్యారు. విద్యార్థుల రక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

See also  కృష్ణా జిల్లా పురిటిగడ్డలో ఇక్ష్వాకుల(Ikshvaku) కాలం నాటి అరుదైన శాసన సహిత శిలా విగ్రహం లభ్యం!

ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ఘటనలు..

  • గత నెలలో.. కోల్‌కతాకు చెందిన 34 ఏళ్ల శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీ లోని సెయింట్ లూయిస్ లో కాల్చి చంపబడ్డాడు.
  • అదే నెలలో బోస్టన్ యూనివర్శిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి సైతం హత్యకు గురయ్యాడు.
  • మార్చిలో.. మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే మరో భారతీయ విద్యార్థి రహస్య పరిస్థితుల్లో క్లీవ్ల్యాండ్ ప్రాంతం నుండి అదృశ్యమయ్యాడు. అతని విడుదల కోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబానికి ఫోన్ కాల్ వచ్చింది.
  • పర్డ్యూ యూనివర్శిటీలో 23 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలోని nature preserve లో శవమై కనిపించాడు.
  • ఫిబ్రవరి 2న, వివేక్ తనేజా అనే 41 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన IT ఎగ్జిక్యూటివ్, వాషింగ్టన్లోని రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో ప్రాణాపాయ గాయాలకు గురయ్యాడు.
  • ఈ సంవత్సరం ప్రారంభంలో, హైదరాబాద్ కి చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థి చికాగోలో దారుణంగా దాడి చేయబడి తీవ్రంగా గాయపడ్డాడు.
  • ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో విద్యార్థి నీల్ ఆచార్య మరణం, జార్జియాలో వివేక్ సైనీని దారుణంగా చంపడం వంటి సంఘటనలు అమెరికాలోని భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
See also  Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top