Article 370: లఢఖ్‍‌ను భారత్ అక్రమంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని మరల విషం కక్కిన చైనా

Share the news
Article 370: లఢఖ్‍‌ను భారత్ అక్రమంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని మరల విషం కక్కిన చైనా

Article 370 రద్దుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇటీవల కీలక తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పు పట్ల మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనాలు ఎప్పటిలా పాత పాటే పాడాయి. భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తమ అక్కసును వెళ్లగక్కాయి. ఇక పోతే తాజాగా మరోసారి భారత్‌పై చైనా విషం చిమ్మింది. అక్రమంగా లఢఖ్‌ను భారత్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆరోపించారు. పైగా లఢఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని చైనా గుర్తించడం లేదంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

Article 370: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మావో నింగ్

భారత్‌ చైనా సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదని.. లఢఖ్‌ ప్రాంతం ఎప్పటికీ తమ భూభాగమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు మావో నింగ్. అంతకుముందు కూడా ఇదే విషయంపై స్పందించిన చైనా.. పాక్ చేసిన వాదనకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. భారత్ విషయంలో గానీ.. భారత్‌తో సరిహద్దుల విషయంలో గానీ పాకిస్థాన్, చైనాలో ఒకే రకమైన వైఖరి తీసుకోవడం తెలిసిందే.

See also  China earthquake kills 111: చైనా లోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో 6.2 తీవ్రతతో భూకంపం

ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువ లేదని వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్ . ఆ వ్యాఖ్యలను సమర్థించిన చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. భారత్‌ – పాక్‌ల మధ్య ఎంతో కాలంగా జమ్మూ కాశ్మీర్ వివాదం కొనసాగుతోందని పేర్కొంది. రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతి మార్గంలో చర్చల ద్వారా జమ్మూ కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. కాశ్మీర్‌ విషయంలో చైనా వైఖరి స్పష్టంగా ఉంది అంటూ చైనా వ్యాఖ్యలు చేసింది.

అసలు భారత్ తమ దేశంలో చేసే చట్టాలకు అంతర్జాతీయ acceptance ఎందుకు అసలు? ఏదొక విషయం మీద భారత్ పై విషం చిమ్మే పొరుగు దేశాలకు ఆ మాత్రం జ్ఞానం లేదా?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top