Indians can visit Iran with out Visa: అవును ఇకపై వీసా లేకుండానే భారతీయులు ఇరాన్‌కి వెళ్లొచ్చు

Share the news
Indians can visit Iran with out Visa: అవును ఇకపై వీసా లేకుండానే భారతీయులు ఇరాన్‌కి వెళ్లొచ్చు

Indians can visit Iran with out Visa

Indians can visit Iran with out Visa, ఇకపై వీసా (Iran Visa) లేకుండానే భారతీయులు తమ దేశానికి రావచ్చని ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఇరాన్‌ సాంస్కృతిక శాఖా మంత్రి ఎజతొల్లా (Ezzatollah Zarghami) ఈ ప్రకటన చేశారు. కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ఇరాన్. భారత్‌తో పాటు మొత్తం 33 దేశాల పౌరులు వీసా అవసరం లేకుండానే ఇరాన్‌కి వచ్చేలా కీలక మార్పులు చేసింది. కేబినెట్ మీటింగ్ తరవాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు ఎజతొల్లా. పర్యాటక రంగాన్ని (Iran Tourism) బలోపేతం చేసేందుకు ఇలా నిబంధనలు సవరించింది. ఇరాన్‌ గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ మరకను పోగొట్టుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు మంత్రి ఎజతొల్లా వివరించారు.

See also  Invest In Telangana Campaign: దావోస్​లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి

ఈ మద్యే మలేషియా, శ్రీలంక, వియత్నాం కూడా భారతీయ పర్యాటకులకు వీసా నిబంధనలను ఎత్తివేసాయి. ఇప్పుడు ఇరాన్ కూడా వాటి జత చేరింది. భారత్‌ ఔట్‌బౌండ్ టూరిజం (India Outbound Tourism Market) మార్కెట్‌ ఇటీవల బాగా పెరిగింది. McKinsey లెక్కల ప్రకారం…గతేడాది కోటి 30 లక్షల మంది భారతీయులు విదేశీ పర్యటనకు వెళ్లారు.

ఇరాన్‌ ప్రకటన ప్రకారం భారత్‌తో పాటు యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, టాంజానియా, కాంబోడియా, మలేషియా సహా పలు దేశాల పౌరులు వీసాలు లేకుండానే ఇరాన్‌కి వెళ్లచ్చు. ఇటీవలి లెక్కల ఆధారంగా చూస్తే…ఇరాన్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య 44 లక్షలకు పెరిగింది. గతేడాదితో పోల్చి చూస్తే ఇది 48.5% ఎక్కువ. ఈ డిమాండ్‌ని మరింత పెంచేందుకు వీసా నిబంధనలను పక్కన పెట్టింది ఇరాన్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top