Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

Share the news
Pavan Davuluri: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి!

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు కొత్త బాస్‌గా తెలుగోడు పవన్‌ దావులూరి(Pavan Davuluri)

మైక్రోసాఫ్ట్‌(Microsoft)కు చెందిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్(Microsoft Windows), సర్ఫేస్‌(Microsoft Surface) విభాగాలకు కొత్త బాస్‌ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు(IIT Madras) పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి (Pavan Davuluri)ని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్‌ పనయ్‌ (Panos Panay) గతేడాది అమెజాన్‌లో చేరడంతో ఆయన స్థానంలో పవన్‌కు బాధ్యతలు అప్పగించారు. మైక్రోసాఫ్ట్‌లో పవన్ 2001లో చేరారు. దాదాపు మూడేళ్లుగా కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

పవన్‌ దావులూరి.. ఐఐటీ మద్రాసులో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1999లో అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం(University of Maryland)లో ఎంఎస్‌ పట్టా అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా పదవి చేపట్టారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తాజా నియామకానికి ముందు ఆయన విండోస్ సిలికాన్ అండ్‌ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

See also  America remark: కేజ్రీవాల్‌ అరెస్ట్ పై మరోసారి నోరు జారిన అమెరికా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top