Serial deaths of Indian students: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. ఈ వారంలో ఇది 2వది! USA సేఫ్ కాదా?

Share the news
Serial deaths of Indian students: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. ఈ వారంలో ఇది 2వది! USA సేఫ్ కాదా?

Serial deaths of Indian students in America

అమెరికాలో మరో భారత విద్యార్థి మరణించాడు. గత నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఆర్ఫాత్(25)(Mohammed Abdul Arfaat) యూఎస్(US) లో ఓహియో(OHIO) రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్‌లో(Cleveland) నగరంలో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని(New York) భారత రాయబార కార్యాలయం(Indian Embassy) మంగళవారం వెల్లడించింది. “ఇటీవల అదృశ్యమైన విద్యార్థి అర్ఫాత్ మరణించడం బాధాకరం. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి” అని X వేదికగా పేర్కొంది. అర్ఫాత్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని, వీలైనంత త్వరగా మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తామని, విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరిగేలా చొరవ తీసుకుంటామని వెల్లడించింది.

కాగా, హైదరాబాద్‌లోని(Hyderabad) నాచారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేందుకు 2023 మే లో అమెరికాకు వెళ్లాడు. గత నెల 7 నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అనంతరం 19వ తేదీన అర్ఫాత్ తండ్రికి ‘అర్ఫాత్‌ను కిడ్నాప్ చేశామని, విడుదల చేయాలంటే 1,200 డాలర్లు ఇవ్వాలని’ డిమాండ్ చేస్తూ ఓ కాల్ వచ్చింది.. దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే అర్ఫాత్ శవమై కనిపించాడు.

See also  Prabhas Kalki Movie Update: ప్రభాస్-దిశా పటానీపై సాంగ్ షూటింగ్ స్టార్ట్!

దీనితో ఈ ఏడాది యూఎస్‌లో మరణించిన భారతీయుల సంఖ్య 11కి చేరుకుంది. గత వారం క్లీవ్ ల్యాండ్ లోనే ఉమా సత్యసాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మరణించాడు. అతని మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగానే మరో విద్యార్థి మరణించడం గమనార్హం. ఈ విధంగా వరుసగా జరుగుతున్న భారత విద్యార్థుల మరణాలతో (Serial deaths of Indian students)అక్కడున్న మిగతా విద్యార్థుల తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top