Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్

Share the news
Series of earthquakes in Japan: నూతన సంవత్సరం ఆరంభంలోనే వరుస భూకంపాలతో వణికిన జపాన్

Series of earthquakes in Japan

నూతన సంవత్సరం ఆరంభంలోనే Ishikawa కేంద్రంగా జపాన్లో ఆకస్మికంగా సంభవించిన భూకంపానికి ప్రజలు భయాందో ళనకు గురయ్యారు.. భవనాల, హోటళ్ళు, నుంచి కొందరు భయంతో బయటకు పరుగులు తీయగా మరికొందరు టేబుల్స్ కింద తలదాచుకున్నారు. మరోవైపు భూకంపం ధాటికి అనేక ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. తీరప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇషికావా లోని వాజిమా సిటీ తీరాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో వున్న అలలు తాకాయి. ఇషికావాలో వున్న అణు విద్యుత్ కేంద్రం మాత్రం సురక్షితం ఉందని అధికారులంటున్నారు

కాగా మొదటి భూకంపం దక్షిణ తీరంలో భూకంప తీవ్రత రికర్ట్ స్కేల్పై 7.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 7.4 తీవ్రత తర్వాత మరోసారి 21 ప్రకంపనలు నమోదయ్యాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వము. తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

See also  కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు - వీడియో

Earthquakes in Japan

మార్చి 2011లో ఈశాన్య జపాన్‌లో 9.0 తీవ్రతతో సముద్రగర్భంలో సంభవించిన భారీ భూకంపం యొక్క జ్ఞాపకాలు జపాన్‌ను వెంటాడుతున్నాయి, ఇది సునామీని ప్రేరేపించింది, దీని వలన సుమారు 18,500 మంది మరణించారు లేదా ఆచూకీ దొరకలేదు. మార్చి 2022లో, ఫుకుషిమా తీరంలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం తూర్పు జపాన్‌లోని పెద్ద ప్రాంతాలను కదిలించింది, ముగ్గురు వ్యక్తులు మరణించారు. శతాబ్ది క్రితం 1923లో వచ్చిన భారీ భూకంపం వల్ల రాజధాని టోక్యో అతలాకుతలమైంది.

@ సురేష్ కశ్యప్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top