Volcano Emitting gold: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం!

Share the news
Volcano Emitting gold: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం!

బంగారం వెదజల్లుతున్న Volcano

అంటార్కిటికా(Antarctica) లోని ఎరేబస్ అగ్ని పర్వతం నుంచి ప్రతిరోజూ లావాతో పాటుగా దాదాపు 80 గ్రాముల వరకు బంగారం కరిగి ద్రవ రూపంలో, రేణువుల రూపంలో బయటకు పెల్లుబుకుతూ ఉంటుంది. ఈ అగ్ని పర్వతం నుంచి కేవలం బంగారం మాత్రమే కాకుండా ఇతర విలువైన ఖనిజాలు కూడా బయటకు వస్తుంటాయని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) పేర్కొన్నది.

అంటార్కిటికాలోని డిసెప్షన్ ద్వీపంలో ఉన్న రెండు క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ ఎరేబస్(Mount Erebus) ఒకటి. 12,448 అడుగుల ఎత్తైన ఈ అగ్నిపర్వతం షుమారుగా 1000 కిలోమీటర్ల దూరం వ్యాపించే దుమ్ము మేఘాలను విడుదల చేస్తుంది.

కొసమెరుపు ఏంటంటే… ఇక్కడ బంగారం బయటకు వెదజల్లుతున్నప్పటికీ, దానిని సేకరించే ధైర్యం ఎవరూ చేయరు. ఎందుకంటే దాని చుట్టూ అత్యంత వేడిగా మరుగుతున్న లావా ఉంటుంది.

-By VVA Prasad

See also  Health Insurance: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆరోగ్య భీమాకు వయో పరిమితి తొలగింపు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top