
Kejriwal Arrest పై స్పందించిన అమెరికా, మొన్న జర్మనీ.. But Why?
మద్యం పాలసీ స్కామ్ కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు(Kejriwal Arrest) చేసిన సంగతి తెలిసిందే. దానిపై మంగళవారం, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం న్యాయమైన, పారదర్శక మరియు సమయానుకూల న్యాయ ప్రక్రియను మేము ప్రోత్సహిస్తున్నాము.” అని చెప్పిన మరుసటి రోజు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యుఎస్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు బుధవారం సమన్లు పంపింది. అధికారిక ప్రకటనలో, మంత్రిత్వ శాఖ “భారతదేశంలో కొన్ని చట్టపరమైన చర్యల గురించి US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది” అని తెలిపింది.
“దౌత్యంలో, దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం మరియు అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నాం. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఇది అనారోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది” అని ప్రకటన పేర్కొంది. “భారతదేశం యొక్క చట్టపరమైన ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయి, సమయానుకూల ఫలితాలకు కట్టుబడి ఉంటుంది. దానిపై అపోహలు వేయడం అసంబద్ధం” అని మన మంత్రిత్వ శాఖ పేర్కొంది.ANI వార్తా సంస్థ ప్రకారం, మంత్రిత్వ శాఖలో బెర్బెనాతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
ఇంతకు ముందు బెర్లిన్‌లోని ఒక విదేశీ వ్యవహారాల ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా “తీవ్ర నిరసన” తెలియజేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ జర్మన్ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజ్‌వీలర్‌ను పిలిచిన కొద్ది రోజులకే అమెరికా పరిణామం జరిగింది.
కొసమెరుపు: Kejriwal Arrest పై అటు మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించి, భారత్ అంతర్గత విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వుంది. పాకిస్తాన్ లేదా చైనాలు ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు కానీ అమెరికా మరియు జర్మనీ ఇలా స్పందించడానికి అదీ కూడా కేజ్రీవాల్ విషయంలో, వాళ్ళకున్న కారణాలు ఏమిటో కనుక్కోవాలి. భారత్ ఆర్ధికంగా బలపడటం, చేయి చాసే పరిస్థితి నుండి శాసించే స్థితికి చేరుకోవడం ఇష్టం లేని శక్తులు ఏవైనా కుట్రలు చేస్తున్నాయా అనే కోణం లో కూడా చూడాలి.