BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

Share the news

జనసేనకు 2 పార్లమెంటు.. 21 అసెంబ్లీ
బీజేపీకి 6 పార్లమెంటు.. 10 అసెంబ్లీ
మిగిలిన 17 లోక్‌సభ.. 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ
1 పార్లమెంటు, 3 అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన జనసేన
8 గంటలపాటు మూడు పార్టీల నేతల భేటీ

BJP TDP Janasena Alliance: పొత్తు ద్వారా బాగా లబ్ది పొందిన బీజేపీ.. నష్టపోయిన జనసేన!

BJP TDP Janasena Alliance సీట్ల పంపకం ఖరారు

పొత్తు(BJP TDP Janasena Alliance)లో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశంపై టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) తుది నిర్ణయానికి వచ్చాయి. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు(Chandra Babu) నివాసంలో జరిగిన సమావేశంలో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, మాజీ ఎంపీ వైజయంత్‌ పాండా దాదాపు 8 గంటలు చర్చలు జరిపారు.

చర్చల అనంతరం ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నదీ వివరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. ఇక పోతే బీజేపీ 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు ఇచ్చారు. కానీ నిన్న జరిగిన సమావేశం తరువాత జనసేన 1 ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది.

See also  Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత! .. ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు!

ఇక సీట్ల సర్దుబాబు అంశాలతోపాటు మూడు పార్టీలు ఉమ్మడిగా విడుదల చేయాల్సిన మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తాము(టీడీపీ మరియు జనసేన) ప్రకటించిన అభివృద్ధి, సంక్షేమం సమతుల్యత నిండిన హామీల గురించి బీజేపీకి తెలిపారు. ఇక ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చే హామీలతో కలపి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయబోతున్నారు.

సీట్ల సంఖ్య తేలింది కానీ ఎవరు ఎక్కడి నుంచి అనేది ఇంకా పూర్తిగా తేలలేదు. చర్చల వివరాలను బీజేపీ నేతలు ఎప్పటికప్పుడే ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కార్యాలయానికి తెలిపారు. తమ సీట్లపై స్పష్టత తీసుకొని షెకావత్‌. పాండా సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో 45 నిమిషాల పాటు చంద్రబాబు, పవన్‌ చర్చించుకున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top