Cell Phone Exploded: సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న బాలిక.. చేతిలో పేలి కుడి చేయి ఛిద్రం..

Share the news
Cell Phone Exploded: సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తున్న బాలిక.. చేతిలో పేలి కుడి చేయి ఛిద్రం..

Cell Phone Exploded

సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ మాట్లాడడం, వీడియోలు చూడడం, చాటింగ్ చేయడం వంటి పనులు చేయకూడదని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా, కొందరిలో మార్పు రావడం లేదు. దీని కారణంగా గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి 5వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంట్లో సెల్ ఫోన్(Cell Phone) చార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా బాలిక చేతిలోని ఆ సెల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది(Cell Phone Exploded).

ఈ ప్రమాదంలో బాలిక కుడి చేయి ఛిద్రం అయ్యి రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి. అలానే బాలిక పొట్ట భాగంలో కూడా గాయాలు అయ్యాయి. దీనితో ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే 108 కు సమాచారమిచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

See also  Rs 4000 Pension: కూటమిదే అధికారం…. అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు రూ.4000 పింఛన్!

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top