Chiranjeevi Blesses Janasenani: జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళంతో పాటు ఆశీర్వాదం కూడా.. ఇక కూటమికి తిరుగు లేదు!

Chiranjeevi Blesses Janasenani: జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళంతో పాటు ఆశీర్వాదం కూడా.. ఇక కూటమికి తిరుగు లేదు! పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు ఈరోజు చిరంజీవిని 'విశ్వంభర' సినిమా సెట్స్ లో కలుసుకున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ని సాధారంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకున్నారు.
Share the news
Chiranjeevi Blesses Janasenani: జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళంతో పాటు ఆశీర్వాదం కూడా.. ఇక కూటమికి తిరుగు లేదు!

Chiranjeevi Blesses Janasenani

అది ఒక అపురూపమైన సన్నివేశం ముగ్గురు అన్నదమ్ములు, చిరంజీవి(Chiranjeevi), నాగబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈరోజు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ సెట్స్ లో కలిశారు. చిరంజీవి ఇష్ట దైవం ఆంజనేయస్వామి విగ్రహం ముందు తమ్ముడిని ఆశీర్వదించి(Chiranjeevi Blesses Janasenani), జనసేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి. ‘జనసేనకు విజయోస్తు, విజయీభవ’ అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు(Chiranjeevi Blesses Janasenani).

హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం పదిగంటలకు లొకేషన్ కు చిన్నన్న నాగబాబుతో కలసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి, చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు.

See also  Election Code Violations: ప్రభుత్వ జీతం.. వైసీపీ కి ప్రచారం.. ఈసీకే సవాల్ విసురతున్న పారిశుద్ధ్య కార్మికుడి లీలలు!

చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆలింగనం చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి, అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు.

ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందచేశారు. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన రామ్ చరణ్(Ram Charan) కూడా తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.

See also  Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

ఇక చిరంజీవి చెక్కును అందించిన సందర్భంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు, టి.శివశంకర్, కోశాధికారి ఎ.వి.రత్నం, అధికార ప్రతినిధి వి.అజేయ కుమార్, అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ పాల్గొన్నారు.

Scroll to Top