
Lok Sabha Elections ల్లో బిజెపి ఓటమి కోసం కోవర్ట్ ఆపరేషన్!
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ఫలితాలు ప్రకటించడానికి కేవలం నాలుగు రోజుల ముందు బాంబ్ లాంటి వార్త. భారతదేశంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి కృత్రిమ మేధస్సు నమూనాలను ఉపయోగించే రహస్య కార్యకలాపాలను తాము అడ్డుకున్నామని OpenAI పేర్కొంది.
ఓపెన్‌ఏఐ యొక్క నివేదిక ప్రకారం డబ్బు కోసం పని చేసే ఒక ఇజ్రాయెల్ సంస్థ “భారత్‌పై దృష్టి సారించే వ్యాఖ్యలను రూపొందించడం ప్రారంభించింది, అధికార బిజెపి పార్టీని విమర్శించింది మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసించింది.” భారతీయ ఎన్నికలపై దృష్టి సారించిన కార్యాచరణ మేలో మొదలైంది, “నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్‌లోని రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ STOIC నిర్వహించింది” అని నివేదిక పేర్కొంది.
OpenAI నివేదిక ప్రకారం “ఈ ఇజ్రాయిల్ సంస్థ ప్రజాభిప్రాయాన్ని మార్చటానికి లేదా రాజకీయ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించే రహస్య కార్యకలాపాల కోసం AIని ఉపయోగిగించింది. X, Facebook, Instagram, వెబ్‌సైట్‌లు మరియు YouTubeలో కంటెంట్ పోస్ట్ చేసింది. మే ప్రారంభంలో, ఇది (నెట్‌వర్క్) ఆంగ్ల భాషా కంటెంట్‌తో భారతదేశంలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది” అని నివేదిక పేర్కొంది.
ఈ నివేదికపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ, “కొంతమంది విదేశాల నుంచి భారతీయ రాజకీయ పార్టీల తరపున బీజేపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. దేశ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమైన ముప్పు” అని ఆయన అభివర్ణించారు. భారతదేశం మరియు వెలుపల ఉన్న స్వార్థ ప్రయోజనాలే దీనిని నడిపిస్తున్నాయి మరియు లోతుగా పరిశీలించడం. బహిర్గతం చేయడం అవసరం” అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
“ఈ సమయంలో నా అభిప్రాయం ఏమిటంటే, ఈ ప్లాట్‌ఫారమ్‌లు చాలా ముందుగానే ఈ వార్తను విడుదల చేసి ఉంటే బాగుండేది. ఎన్నికలు(Lok Sabha Elections) ముగిసే సమయానికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు” అని ఆయన చెప్పారు.