
హిమాచల్ ప్రదేశ్ లో Earth Quake
హిమాచల్ ప్రదేశ్: రెండు రోజుల వ్యవధిలో తైవాన్, జపాన్, చైనాలను వణికించిన భూకంపం.. తాజాగా గురువారం రాత్రి 9:34 గంటలకు హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని చంబా ప్రాంతంతోపాటు.. మనాలీలోనూ తీవ్రమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప కేంద్రకాన్ని చంబాలో భూఉపరితలానికి 10 కి.మీ లోతులో గుర్తించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం అందలేదు.
కాగా బుధవారం తెల్లవారుజామున తైవాన్ లో7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం.. ఆ మరుసటి రోజు చైనా, జపాన్‌లోనూ వరుసగా 5.5, 6.3 తీవ్రతతో సంభవించింది.
-By VVA Prasad