కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో

Share the news
కార్గో షిప్ ఢీకొనడంతో బాల్టిమోర్‌లో(USA ) కూలిన Francis Scott Key Bridge.. నదిలో పడిన కార్లు – వీడియో

బాల్టిమోర్‌లో కూలిన Francis Scott Key Bridge

అమెరికాలో అర్ధరాత్రి ఘోర ప్రమాధం జరిగింది. మేరీల్యాండ్ లోని బాల్టీమోర్(Baltimore) లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ బ్రిడ్జి కిందనుంచి ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక ఢీకొట్టడంతో ఈ ప్రమాధం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో అనేక వాహనాలు నదిలో పడిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్న వారు కూడా నదిలో పడి గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

సుమారు 1.30 గంటలకు, భారీ కార్గో షిప్ ఒకటి బ్రిడ్జి యొక్క పిల్లర్ ని ఢీకొంది. దానితో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి మునిగిపోయే ముందు మంటలు కూడా వ్యాపించాయి, X లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం. ‘I-695 కీ బ్రిడ్జ్‌పై జరిగిన సంఘటన వలన అన్ని లేన్‌లు రెండు వైపులా మూసివేయ బడ్డాయి. ట్రాఫిక్ మళ్లించబడుతోంది,’ అని మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ(Maryland Transportation Authority) X లో పోస్ట్ చేసింది. బాల్టిమోర్ మేయర్, బ్రాండన్ M స్కాట్ మరియు కౌంటీ ఎగ్జిక్యూటివ్, జానీ ఓల్స్‌జ్వెస్కీ Jr, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారని మరియు రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

See also  APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top