చిన్ననాటి నగ్న ఫోటో అప్లోడ్ చేసిన Gujarat Man.. అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్..

Share the news
చిన్ననాటి నగ్న ఫోటో అప్లోడ్ చేసిన Gujarat Man.. అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్..

గుజరాత్ వ్యక్తి(Gujarat Man) ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్(Google)

గుజరాత్ కు చెందిన వ్యక్తి(Gujarat Man) నీల్ శుక్లా చిన్నప్పటి జ్ఞాపకాలని దాచుకోవడం లో భాగంగా కొన్ని ఫోటోలను గత సంవత్సరం ఏప్రిల్ లో గూగుల్ డ్రైవ్ లోకి అప్లోడ్ చేసాడు. వాటిలో తన రెండేళ్ల వయసులో తన నానమ్మ తనకు స్నానం చేయిస్తున్న ఫోటో కూడా ఉంది. ఫొటోలో బట్టల్లేకుండా ఉండటం చైల్డ్ అబ్యూస్ కిందకు వస్తుందని అతని ఇమెయిల్ ఖాతాను బ్లాక్ చేసిన గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.

శుక్లా ఇ-మెయిల్ ఖాతాను గత ఏడాది ఏప్రిల్‌లో టెక్ దిగ్గజం బ్లాక్ చేసింది, చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌కు సంబంధించిన విధానాన్ని ఉల్లంఘించినందుకు బ్లాక్ చేసిందట. దాంతో శుక్లా గుజరాత్ పోలీసులను మరియు భారతదేశంలో ఇటువంటి విషయాలకు నోడల్ ఏజెన్సీ అయిన సెంటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించారు. అయినప్పటికీ, వారు ఎటువంటి చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు. ఇదిలా ఉండగా పులి మీద పుట్రలా పిటిషనర్ గూగుల్ నుంచి ఇంకో నోటీసు అందుకున్నాడు. వచ్చే ఏప్రిల్ కు ఖాతా ఇనాక్టివ్ గా ఉండటం ఒక సంవత్సరం పూర్తి అవుతుందని, కనుక దానికి లింక్ చేయబడిన డేటా తొలగించబడుతుందని ఆ నోటీసు సారాంశం.

See also  Brave Forest Officer: కశ్మీర్లో ఖాళీ చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ అధికారి! వీడియో చూడండి!

దీనితో చిర్రెత్తుకొచ్చిన శుక్లా, తన న్యాయవాది దిపెన్ దేశాయ్ ద్వారా మార్చి 12 న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఏప్రిల్ లో ఖాతా కు లింక్ చేసిన డేటా డిలీట్ నోటీసు గూగుల్ నుండి అందుకున్నందున అత్యవసర విచారణను అభ్యర్థించారు. శుక్లా ఇమెయిల్ ఖాతాను గూగుల్ బ్లాక్ చేసినప్పటి నుండి, అతను తన ఇమెయిల్‌లను యాక్సెస్ చేయలేకపోయాడని, దీనివల్ల అతని వ్యాపారం ఆర్థికంగా నష్టపోతుందని దేశాయ్ కోర్టుకు తెలియజేశాడు. ఇక మార్చి 15న జస్టిస్ వైభవి డి నానావతి న్యాయస్థానం గూగుల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్చి 26 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

సిల్లీగా ఉన్నా కూడా గుజరాత్ వ్యక్తి (Gujarat Man) వేసిన ఈ కేసుతో, గూగుల్ తన AI సాఫ్ట్వేర్ ని సరి చేసుకోవాల్సి రావచ్చు మరి. ఏమవుతుందో చూద్దాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top