Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం!

Honor to Chiranjeevi in USA: ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించి గౌరవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకొని సతీ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవికి, అమెరికాలో వున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సన్మానం చేయనున్నట్టు తెలిసింది.
Share the news
Honor to Chiranjeevi in USA: అమెరికా లో అన్నయ్య చిరంజీవికి సన్మానం!

చిరంజీవికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన సంగతి తెల్సిందే. అంతకు ముందు 2006 లో చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చి సత్కరిస్తే, ఇప్పుడు 18 సంవత్సరాల తరువాత పద్మ విభూషణ్ అవార్డు ఆయన్ని వరించింది. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు తరువాత పద్మ విభూషణ్ దక్కించుకున్నది చిరంజీవి మాత్రమే.

ఇక ఈ అవార్డు అధికారికంగా ప్రకటించిన తరువాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన పలు శాఖల సాంకేంతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు చిరంజీవి ఇంటికి వెళ్లి అతన్ని అభినందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజుల క్రితం చిరంజీవితో పాటు పద్మ అవార్డు గ్రహీతలు అందరికీ సన్మానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిపింది.

Honor to Chiranjeevi

ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకొని సతీ సమేతంగా అమెరికా వెళ్లిన చిరంజీవికి, అక్కడ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధి, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చిరంజీవిని కలిసి ఒక చిరు సన్మానం చెయ్యాలని చిరంజీవిని అడుగగా అయన ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమెరికా అభిమానుల తరుపున చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా విశ్వప్రసాద్ చిరంజీవి సన్మాన కార్యక్రమాన్ని(Honor to Chiranjeevi ) ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసింది.

See also  SB Organics కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు సంఘటన లో అదుపులోకి వచ్చిన మంటలు

Also Read News

Scroll to Top