బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

Share the news
బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

BRS కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

BJP attracting Top BRS Leaders: తెరాస(TRS) పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకిపార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు అయన సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్‌కు(KTR) అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఖమ్మం జిల్లా కీలక నేత జలగం వెంకట్రావు, అయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలపొందిన ఒకే ఒక్క్కడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు కూడా బీజేపీల చేరారు.

See also  Sharmila YSRTP merge with Congress? 4న ఢిల్లీకి వైఎస్ షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికేనా!

బీఆర్ఎస్ పని ఖతం
ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తుది అని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తుందన్నారు లక్ష్మణ్.

కొసమెరుపు: తెరాస పేరును ఎప్పుడు బీఆర్ఎస్ గా మార్చారో కానీ అప్పటినుంచి తెరాసకి పెద్దగా ఏది కలసి రావడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో వున్న సమయంలో అధిష్టానం తీసుకున్న చర్యలే వాళ్లకి ఇప్పుడు శాపంగా మారుతున్నాయి. ఉద్యమ కారులను పక్కన పెట్టి టీడీపీ మరియు కాంగ్రెస్ నాయకులను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకున్నారు. దాంతో టీడీపీ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. కాంగ్రెస్(Congress) మాత్రం బతికి బట్ట కట్టి ఈసారి ప్రభుత్వలోకి కూడా వచ్చింది. రావడమే కాదు ఒక పక్కనుంచి బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తుంది. ఇక రెండో పక్కనుంచి బీజేపీ కూడా అదే పనిలో వుంది. ఈ దెబ్బతో బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డుకే పరిమితం అయ్యేలా ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top