Negligent Doctors: నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Share the news
Negligent Doctors: నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Negligent Doctors కు ఐదేళ్ల జైలు శిక్ష

నిర్లక్ష్యపు వైద్యంతో రోగి మరణానికి కారణమైతే సదరు డాక్టర్‌(Negligent Doctors)కు ఇక నుంచి ఐదేళ్లు జైలు శిక్షను విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలాన్ని పెంచుతూ కొత్త చట్టాలను రూపొందించారు. ఈ మేరకు వైద్యులకు అవగాహన కల్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(Director general of Health Services) డైరెక్టర్ అతుల్ గోయల్ అన్ని రాష్ట్రాల సీఎస్, హెల్త్ సెక్రటరీలకు లేఖ రాశారు.

ప్రస్తుతం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్య సిబ్బందికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉన్నది. కానీ దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం కచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం, అంతేగాక గరిష్ఠంగా ఐదేండ్ల శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది. డాక్టర్‌(Doctor) అయితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని, RMP అయితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొంది.

See also  SPF Constable Suicide: విశాఖలో తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

ప్రస్తుతం దేశంలో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1860’ అమల్లో ఉండగా, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సక్ష్య అభియాన్‌ పేరుతో మూడు కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top