KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు

గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి కావడంతో, విశాఖ బీచ్ ల‌లో త‌న కూతురు KlinKara మరియు భార్య ఉపాసన తో జాలీ గా స‌మ‌యాన్ని గడిపిన రామ్ చరణ్.
Share the news
KlinKara at RK Beach: కూతురు క్లింకారా తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆట‌లు

కూతురు క్లింకారా(KlinKara) తో విశాఖ బీచ్‌లో రామ్ చ‌ర‌ణ్

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వైజాగ్(Vizag) లో జరుగుతుంది. తాజా స‌మాచారం మేర‌కు చ‌ర‌ణ్ విశాఖపట్నంలో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించాడు.

గేమ్ ఛేంజర్(Game Changer) షెడ్యూల్ పూర్తి కావడంతో, ఆయన విశాఖ ఆర్ కె బీచ్ (RK Beach) లో త‌న ఫ్యామిలీతో విలువైన‌ స‌మ‌యాన్ని గడిపాడు. అంతేకాదు.. విశాఖ‌లోని అంద‌మైన బీచ్ లో త‌మ కూతురు క్లింకారాతో పాటు ఎంతో జాలీగా ఆట‌లు ఆడుకున్నాడు. ఇక్క‌డ ఆర్కే బీచ్ స‌హా ప‌లు బీచ్ లొకేష‌న్ల‌లో చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట క్లింకారాతో స‌ర‌దాగా ఆట‌లు ఆడుతూ ఆనందిస్తూ క‌నిపించారు.

అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు ఇంటర్నెట్ లో వ‌చ్చింది. వైజాగ్ తమ హృదయాలను దోచుకుందని, క్లింకారా కు ఇది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అని ఉపాసన(Upasana) తన insta లో పోస్టు చేశారు.

See also  SPF Constable Suicide: విశాఖలో తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

Also Read News

Scroll to Top