ఆంద్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో సిద్ధం పోస్టర్లను(YCP Siddham) ఏర్పాటు చేశారు.
వీటికి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సిద్ధం(YCP Siddham) పోస్టర్లను తలదన్నే రీతిలో ప్రతిగా సిద్ధం విమర్శనాత్మక పోస్టర్లు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించారు.
TDP-Janasena Satires on YCP Siddham
- మిమ్మలి దోచుకోవటానికి మళ్ళీ నేను సిద్ధం మీరు సిద్ధమా ?
- బాదుడే బాదుడుకు నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా?
- మీ ఇంటిని, మీ పొలాన్ని, మీ ఆస్తిని లాక్కోవటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు కరెక్టుగా వేయకుండా వేదించటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- మిగిలిన రోడ్లను కూడా లేకుండా చేసి గుంతల మయం చెయ్యటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా?
- జే బ్రాండ్ మద్యంతో మీ ఇంటిని, వంటిని గుల్ల చేయడానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- మీకు ఉద్యోగాలు లేకుండా చేయటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- మీకు రాజధాని లేకుండా చేయటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా ?
- ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి కి అడ్డాగా చేయటానికి నేను మళ్ళీ సిద్ధం మీరు సిద్ధమా?
అంటూ పలు అంశాలతో కూడిన సిద్ధం పోస్టర్లను చూసిన ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోస్టర్లు సూటిగా సుత్తి లేకుండా సామాన్యుడికి కూడా తేలికగా ఆర్డమయ్యేలా వేశారు. దీనికి ప్రతిగా వైసీపీ ఏమి ఎత్తు వేస్తుందో చూడాలి
-By Guduru Ramesh Sr. Journalist