RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట!

Share the news
RRR Original: ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. మనం చూసిన RRR & మొదట్లో షూట్ చేసిన RRR ఒకటి కాదట!

రౌద్రం రణం రుధిరం(RRR) సినిమా రిలీజ్ అయ్యి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది. భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులు, హాలీవుడ్ సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో నచ్చింది. ఇంకా చెప్పాలి అంటే జపాన్ లో RRR కి వచ్చిన ఆదరణ నభూతో నభవిష్యత్. RRR వాళ్ళ జీవితాల్లో ఒక భాగమై పోయింది.

ఇక అసలు విషయానికి వస్తే జపాన్ లో 500 రోజులకు పైగా ఇంకా నడుస్తున్న సందర్బంగా స్పెషల్ స్క్రీన్నింగ్స్ కోసం అతిధి గా మన RRR దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు. ఆ సందర్బంగా ప్రేక్షకులతో ముచ్చటిస్తూ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అదేమిటంటే ప్రేక్షకులు చూసిన సినిమా వేరు… రాజమౌళి ముందుగా తీసిన ఆర్ఆర్ఆర్ ఒరిజినల్(RRR Original) వెర్షన్ వేరు అట! సినిమా అంతా పూర్తి అయ్యాక మరీ శాడ్ ఫిలింలా ఉందని ఫీలై, ఎన్టీఆర్ మరియు ఎన్టీఆర్ జోడీ ఒలీవియా మోరిస్ క్యారెక్టర్లలో మార్పులు చేశారట.

RRR Original, మనం చూసిన RRR ఒకటి కాదట!

ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ వెర్షన్ లేదా డిలీట్ చేసిన సీన్స్ లో జెన్నీ అలియాస్ జెన్నీఫర్ (ఒలీవియా) క్యారెక్టర్ మరణిస్తుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) చెప్పారు. ”మేం మొదట జెన్నీఫర్ తన అంకుల్ గదిలోకి వెళ్లి వాళ్ల ప్లాన్స్ తెలుసుకునే సీన్స్ రాశాం. అయితే, క్లైమాక్స్ దగ్గర పడుతుండటంతో అవన్నీ అనవసరం అని ఫీల్ అయ్యాం. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాం. భీం (NTR)ను కలిసిన జెన్నీఫర్, మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బూట్లకు మట్టి ఉండటంతో ఏదో చేసిందని వాళ్ళ ఆంటీకి అనుమానం వస్తుంది. అలాగే, జైలు నుంచి రామ్ (Ram Charan)ను భీం తప్పించి… బ్రిటిషర్ల మీద ఎటాక్ చేసినప్పుడు జెన్నీకి అంకుల్ గన్ గురి పెడతారు. వాళ్ళను లొంగిపోమని చెబుతాడు. లోగిపోవడానికి ముందు షూట్ చేయడంతో జెన్నీ మరణిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఒరిజినల్(RRR Original) వెర్షన్ లో జెన్నీ చచ్చిపోతుంది. నేను అంత సాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోలేదు” అని చెప్పారు.

See also  RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top