Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు

Share the news
Event: Raaga Saptha Swaram 35 వ వార్షికోత్సవానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు & సంస్థ సభ్యులు

ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగ సప్త స్వరం 35 వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై ప్రముఖ నటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారం తో స్వర్ణ కంకణ ప్రదానం, అమెరికా లో స్థిర పడిన ప్రముఖ నాట్య గురువు జమైకా ట్రేడ్ కమిషనర్ వింజమూరి సుజాత కు ఆత్మీయ సత్కారం చేయనున్నట్లు సంస్థ స్థాపకురాలు వీ.ఏస్.రాజ్యలక్ష్మి తెలిపారు.

Raaga Saptha Swaram Event

ఈ కార్యక్రమం జనవరి 3 తారీఖు బుదవారం సాయంత్రం 5.30 ని ల నుండి రవీంద్ర భారతి ఆడిటోరియం లో జరుగును ఆనాటి కార్యక్రమమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, రామకృష్ణ రాజు, నటుడు మురళీమోహన్, టర్కీ కన్సలేట్ జనరల్ యల్మన్ ఒకన్, ఐటో ప్రెసిడెంట్ డాక్టర్ అసఫ్ ఈక్బాల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

See also  Janasenani Victory: మెగా కుటుంబం లో జనసేనాని గెలుపు సంబరాలు..

Raaga Saptha Swaram కార్యక్రమానికి తొలుత వింజమూరి సుజాత నృత్య రూప కల్పన చేసిన కృష్ణవేణి నృత్య రూపకం అమెరికా లోని కూచిపూడిఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడెమీ వారు ప్రదర్శిస్తారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మంత్రి జూపల్లి కృష్ణారావు సంస్థ సభ్యులు రాజ్య లక్ష్మీ, కే.అహల్య, గీత రచయిత్రి సుందరవల్లి శ్రీ దేవి నాట్య గురువు సుజాత వింజమూరిలతో కలసి తమ కార్యాలయం లో విడుదల చేశారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top