Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

Managing Stress: చాల మంది వర్క్ ప్రెజర్ ని అలాగే స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేయలేకపోతున్నారు. ఒత్తిడి వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే క్రమక్రమంగా మన ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. అయితే స్ట్రెస్ ని మేనేజ్ చేయడం ఎలా? స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి పెద్ద పెద్ద పనులు చేయడం అవసరమేమీ లేదు ఈ చిన్న చిన్న డైలీ టిప్స్ పాటిస్తూ మన మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు.
Share the news
Managing Stress: ఒత్తిడిని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి.. ఆయుష్షు పెంచుకోండి!

ఒత్తిడి వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే క్రమక్రమంగా మన ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. చాల మంది వర్క్ ప్రెజర్ ని అలాగే స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేయలేకపోతున్నారు. మీలో చాలామంది కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేసి ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న చాల మందికి బీపీ, షుగర్, గుండె సంబందీత వ్యాధులు కూడా వస్తాయి. అందులోనూ చాల మంది ఎక్కువ సేపు కూర్చోవడం వలన కొవ్వు పెరిగి ఒబిసిటీ వస్తుంది ఇది ఇంకా అనేక జబ్బులకు దారి తీస్తుంది అనే చెప్పాలి.

చాలా మంది స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ అంత కరక్ట్ గా మేనేజ్ చేయలేక మధ్యలోనే ఆపేసి మళ్ళీ స్ట్రెస్(Stress) ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనం స్ట్రెస్ ని మేనేజ్(Managing Stress) చేయడానికి పెద్ద పెద్ద పనులు చేయడం అవసరమేమీ లేదు ఈ చిన్న చిన్న డైలీ టిప్స్ పాటిస్తూ మన మైండ్ ని రిఫ్రెష్ చేసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు… మరి అవేంటో మీరూ చూడండి…

మీ గురించి మీరు ఆలోచించండి :
మీరు ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందేలా చూసుకోండి (పెద్దలకు 7-9 గంటలు).
పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, లీన్ ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే డైట్ తీసుకోండి.
Endorphins పెంచడానికి అలాగే ఒత్తిడిని తగ్గించడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనండి.

టైం మేనేజ్ చేసుకోండి :
మీ అన్ని పనులకు ప్రాధాన్యత ఇస్తూనే వాటిలో ముఖ్యమైన పనులేవో తెలుసుకొని వాటిని కంప్లీట్ చేయండి.
ఎక్కువ సమయాన్ని వెచ్చించి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్ స్టెప్స్ లో ఆ పని అయ్యేలాగా ప్లాన్ చేయండి… అప్పుడు మీ పని సులువు అవుతుంది అలాగే మీకు ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు.
అలాగే పనిలో నిమగ్నమైపోయి అలాగే ఉండకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి… ఆ సమయంలో వేరే పనులు అంటే ఫ్రెండ్స్ కి ఫోన్ చేయడమో, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేయండి. లేదా కాస్త బయటకి వెళ్లి ఫ్రెష్ ఎయిర్ ని తీసుకోవడానికి ట్రై చేయండి.

“నేను ఆ పని చేయను” అని చెప్పడం నేర్చుకోండి:
మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీతో చాల మందికి పని ఉండి మీకు చాల మంది పనులు చెప్తే అందులో కొంత మందికి “నేను ఆ పని చేయలేను నాకు వేరే పనులు ఉన్నాయి” అని చెప్పండి వాళ్ళు ఫీల్ అవుతారు అని మీరు భావిస్తే కాస్త సున్నితంగా “కొంచం సమయం తర్వాత చేస్తాను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను” అని చెప్పండి .
మీ పరిమితులను తెలుసుకోండి అలాగే అవసరమైనప్పుడు అదనపు బాధ్యతలను తిరస్కరించడానికి సిద్ధంగా ఉండండి.

See also  APPSC Group 1 Question Paper: గ్రూప్-1 ప్రశ్నాపత్రం లో పదనిసలు.. పద దోషాలతో పరువు పోగొట్టుకుంటున్న APPSC!

లైఫ్ ని డివైడ్ చేయండి :
మీ లైఫ్ ని వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ అని డివైడ్ చేయండి. పని చేసేటప్పుడు పర్సనల్ లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ లో ఉన్నప్పుడు పని గురించి ఆలోచంచడం కానీ, టెన్షన్ పడడం కాని చేయకండి.

రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయండి :
ఒత్తిడిని(Stress) నిర్వహించడంలో సహాయపడటానికి మీ దినచర్యలో మెడిటేషన్, యోగ లాంటి ఎక్సర్సైజ్ లను చేయండి.

కనెక్ట్ అయి ఉండండి :
మీకు సప్ర్ట్ ఇచ్చే వాళ్ళను మీ పక్కన ఉంచుకోండి. నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని కాకుండా నువ్వు చేయగలవు అని చెప్పే వ్యక్తులతో మాట్లాడడం, వాళ్ళతో నీ ఫీలింగ్స్ పంచుకోవడం, మీ స్ట్రెస్ షేర్ చేసుకోవడం లాంటివి చేస్తే మీకు చాలా రిలీఫ్ గా ఉంటుంది.
ఎమోషనల్ సపోర్ట్ అందించే సంబంధాలను పెంపొందించుకోండి.

బ్రేక్స్ తీసుకోండి :
నడవడానికి లేదా రిలాక్స్ అయ్యే చిన్నపాటి ఎక్సర్సైజ్ లు చేయడానికి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి.

బాధ్యతలు షేర్ చేసుకోండి :
కార్యాలయంలో లేదా ఇంట్లో పనులను అప్పగించడానికి భయపడకండి. బాధ్యతలను షేర్ చేసుకోవడం వల్ల మీ పనిభారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

డాక్టర్ ని కలవండి :
ఒత్తిడి(Stress) విపరీతంగా పెరిగితే, థెరపిస్ట్ లేదా కౌన్సెలర్ వంటి మానసిక ఆరోగ్య నిపుణుడి దగ్గరకు వెళ్ళండి.

హాబీస్ ని అలవాటు చేసుకోండి :
చాలా మందికి బుక్స్ చదవడం, పాటలు వినడం, క్రికెట్ ఆడడం లాంటి హాబీస్ చాలానే ఉంటాయి. ఒకవేళ మీకు ఇలాంటి హాబీస్ ఉండి ఈ మధ్య అవి చేయకపోతే మళ్ళీ మీ హాబీస్ ని మొదలు పెట్టండి. తర్వాత మీలో వచ్చే చేంజ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

వర్క్ ను ముందే ప్లాన్ చేయండి :
ముందు ఏ పని చేయాలి అని మనలో చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి ముందే మీ వర్క్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకొని దాని బట్టి ఫాలో అవ్వండి. ఒక వేల పని మధ్యలో వేరే పని వస్తే ఆ రెండు పనుల్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని ఆలోచించి ఎ పని ముందు చేయాలో డిసైడ్ అవ్వండి.

See also  AP EAPCET 2024 Dates Changed.. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల తేదీల్లో మార్పులు.. TS EAPCET 2024 సంగతేమిటి?

పని అయ్యాక సెలబ్రేట్ చేసుకోండి :
మనం చేసే పని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి అనుకుంటాం ఒకవేళ సక్సెస్ కాకపోతే బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా పని అయితే నేను ఇది చేస్తా పని కాకపోతే ఇది చేస్తా అని ముందే అనుకోండి.
పని అవుతుందా అవ్వదా అన్న విషయాన్ని ఆలోచించకుండా పని అయ్యాక మీరు ఏమి చెయ్యాలి అనుకున్నారో దానిపై దృష్టి పెట్టండి అప్పుడు మీరు ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు దాని వల్ల మీ స్ట్రెస్ తగ్గుతుంది.

2 నిమిషాల నియమాన్ని ప్రాక్టీస్ చేయండి :
ఒక పనిని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం తీసుకుంటే, వెంటనే ఆ పని కంప్లీట్ చేసేయండి. ఇలా చేస్తే ముందు చిన్న చిన్న పనులు అయిపోయి మీకు పని భారం తగ్గుతుంది.

దినచర్యను ఏర్పాటు చేయండి :
పనికి, పర్సనల్ లైఫ్ కి, రిఫ్రెష్ మెంట్ కి ఇలా రోజులో చేసే వేరు వేరు పనులకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని దాన్ని పాటించండి.
సమయం నిరోధించడాన్ని ఉపయోగించుకోండి:
వివిధ పనులు లేదా కార్యకలాపాల కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ఇది మీరు ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది.

ఎప్పుడూ పాజిటివ్ గా ఉండండి :
మీ టైం టేబుల్ లో రాసుకున్న ప్రతి పనిని “నేను పాజిటివ్ గానే ఈ పని చేస్తాను” అని అనుకోని మొదలు పెట్టండి. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అది స్వీకరించి మీరుమ్ పనిని త్వరగా ముగించేలా చేస్తుంది.

మల్టీ టాస్కింగ్ ఆపేయండి :
సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టండి. మల్టీ టాస్కింగ్ పొరపాట్లకు దారి తీస్తుంది దాంతో పాటు మీకు ఎక్కువ పని చేస్తున్నారు అనే భావన వస్తుంది అందువల్ల స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది.

కృతజ్ఞతతో ఉండండి :
చాలామంది ఉన్నవాటితో సంతోషంగా ఉండకుండా లేనివాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు అలా కాకుండా మీరు సంపాదించుకున్న వాటి గురించి మీ దగ్గర ఉన్న వాటి గురించి మీరు కృతజ్ఞత గా ఉంటె మీకు ఏమి కావాలో అది ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తుంది. మీరు చేయాల్సిందల్లా బాధ పడకుండా దాని కోసం ట్రై చేయడం అంతే…

See also  April Fools Day: ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ గా ఎందుకు జరుపుకుంటారు..?

పని చేసే ప్రదేశం బాగుండేలా చూసుకోండి :
మీ పని వాతావరణం ఎంత బాగుంటే మీ పని అంత ప్రశాంతంగా చేయగలరు. అందువల్ల మీరు పని చేసెన్ ప్రదేశం ఎలా ఉందొ చూసి దాని వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే వెంటనే దాన్ని చేంజ్ చేయండి.

మందుకు దూరంగా ఉండండి :
స్ట్రెస్(Stress) లో ఉనప్పుడు చాలామంది మందు, సిగరెట్లు తాగుతూ ఉంటారు అయితే ఇలా చేయడం వల్ల స్ట్రెస్(Stress) తగ్గడం పక్కన పెడితే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అందువల్ల ఆరోగ్యం ఇంకా దెబ్బ తింటుంది కాబట్టి మితిమీరిన కెఫిన్ లేదా ఆల్కహాల్ వినియోగం వంటి అనారోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్‌ల వైపు మళ్లే బదులు, వ్యాయామం, జాగింగ్ లేదా హాబీలలో పాల్గొనడం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించండి.

చూసారు కదా మనం ఉన్నంతలో చేయగలిగే పనులు ఇవి. స్ట్రెస్(Stress) అనేది అందరికీ ఉంటుంది కానీ మనం దాన్ని ఎలా మేనేజ్ చేశాం దాని నుండి ఎలా బయటకి వచ్చాము అనేది చాల ముఖ్యమైనది. పైన చెప్పిన వాటిలో మీకు ఏది నచ్చిందో అది మొదట చేయండి కానీ అది సరిగ్గా వరవుట్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు వేరే టిప్స్ పాటించండి.

మీ స్ట్రెస్(Stress) చాల వరకు రిలీఫ్ అవుతుంది. గుర్తుంచుకోండి అది చేయలేకపోయాను అని బాధ పడడం కంటే మీరు బాధ పడకుండా ఉంటె ఆ పనిని మళ్ళీ చేసి విజయం సాధించవచ్చు. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకండి మిమ్మల్ని ఆపడానికి చాలామంది చాలా చెప్తారు కానీ మీకు ఏది కరక్ట్ అనిపిస్తుందో మీరు అది చేయండి అందువల్ల మీకు సంతృప్తి వస్తుంది.

మనం సంపాదించుకునే వాటిల్లో మన సంతృప్తి కంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పండి… అతిగా ఆలోచించడం ఆపేయండి. ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు.

-By Pranav @ samacharnow.in

Also Read News

Scroll to Top