World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా!

World Radio Day: ఈ రోజు ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. కొన్ని దశాబ్దాల క్రితం, భారతదేశంలో ఒక సాధారణ దేశీయ రేడియో సెట్‌ను సొంతం చేసుకోవడానికి ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్‌మెంట్ నుండి లైసెన్స్ పొందవలసి ఉందని ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో?
Share the news
World Radio Day: ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం.. పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా!

World Radio Day: ఈ రోజు ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. ఈ సందర్బంగా పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందామా!

ఇప్పుడంటే మనం రేడియోను ఎక్కువ పట్టించు కోవడం లేదు కానీ గతంలో ఇది ఒక వెలుగు వెలిగింది. రేడియో కొనుక్కోవాలంటే లైసెన్స్(Radio License) పొందాలనే విషయం ఎంత మందికి తెలుసు? కొన్ని దశాబ్దాల క్రితం, భారతదేశంలో ఒక సాధారణ దేశీయ రేడియో సెట్‌ను సొంతం చేసుకోవడానికి ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్‌మెంట్ నుండి లైసెన్స్ పొందవలసి ఉందని ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో? వాస్తవం ఏమిటంటే రేడియో కొనుగోలు చేయాలి అంటే రూ. 15/- పోస్ట్ ఆఫీస్‌లో చెల్లించి లైసెన్స్ పొందాలి, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 ప్రకారం రూ.15/- చెల్లించి ప్రతి సంవత్సరం దాన్ని పునరుద్ధరించుకోవాలి. 1984 సంవత్సరం వరకు ఇది అమలులో వుంది. 1980 వరకు లైసెన్స్ రుసుము రూ.3/- మాత్రమే. 1981లో రుసుము ఒక్క సారిగా 500% పెరిగి రూ.15/- అయ్యింది.

See also  Ram Charan: అంబానీల సంగీత్ లో ఖాన్‌ల త్రయంతో 'నాటు నాటు' పాటకి కాలు కదిపిన రాంచరణ్!

వార్తలు, నాటకాలు, కధలు, సినిమా పాటలు, సినిమాలు(ఆడియో ట్రాక్) ఒకటేమిటి అన్నిటికి రేడియో నే. ఆఖరికి క్రికెట్ లైవ్ కూడా. అప్పట్లో రేడియో లోనే క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వినే వాళ్ళు జనం. అప్పట్లో పాకెట్ రేడియో మెయింటైన్ చేసే వారు చాలామంది. ఇది ప్రయాణాల్లో క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వినడానికి, పాటలు వినడానికి అనువుగా ఉండేది. ఇక టీవీ వచ్చిన తరువాత రేడియో పై మోజు తగ్గిపోయింది. రేడియో ఇక చరిత్రలో కనుమరుగై పోతుందా అనే టైం లో FM Radio వచ్చి దానికి మరల ప్రాణం పోసినట్లయింది.

మన ఆలిండియా రేడియో గురించి చెప్పాలంటే అది మనదేశంలోనే అతి పెద్ద ప్రసార సంస్థ. 1947లో కేవలం బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు,లక్నో, తిరుచిరాపల్లి నగరాల్లో మాత్రమే ఉన్న రేడియో కేంద్రాలు ఇప్పుడు దాదాపు 425 స్టేషన్లతో దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి. 23భాషల్లో, 179 మాండలీకాలలో ప్రసారాలు కొనసాగుతున్నాయి. 1927లో జూలై 23న మనదేశంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. అప్పుడు బొంబాయి, కలకత్తా నగరాల్లో మాత్రమే రెండు ప్రైవేటు స్టేషన్లు ఏర్పడ్డాయి.

See also  Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ..

ఆలిండియా రేడియో భాషకు, సంగీత సాహిత్యాలకు చేసిన సేవలు గణనీయం. రెండువేల సంవత్సరం తర్వాత ప్రైవేటు రేడియో స్టేషన్లు వచ్చేశాయి. మొబైల్ లో ఎఫ్ ఎం వినే సౌలభ్యం ఏర్పడింది. ఇప్పుడు Newsonair app ద్వారా ఆలిండియా రేడియో, దూరదర్శన్ ప్రసారాలను మొబైల్ లో వినే, చూసే సదుపాయం కల్పించింది. ఈనాడు ప్రతి రేడియో కేంద్రానికి you tube channel ఉంది. ప్రసారమైన కార్యక్రమాలు యూట్యూబ్ లో వినే అవకాశం ఉంది.

World Radio Day

ఇక పోతే ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం(World Radio Day)గా యునెస్కో 2012 నుంచి జరుపుతోంది. రేడియో జనజీవనంలో ఏవిధంగా ఒక భాగమై పోయిందో, సమాచార వాహికగా అందిస్తున్న సేవలను గుర్తు చేసుకోవటం ప్రధాన లక్ష్యం.1946లో యుఎన్ రేడియో ఫిబ్రవరి 13న ఏర్పాటయింది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవం(World Radio Day)గా ప్రకటించింది యునెస్కో.

-By C. Rambabu

See also  TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

రేడియో గురించి మరిన్ని విషయాలు ఈ వీడియో లో చూడండి

Also Read News

Scroll to Top