
నుంచి సున్నాకు పడిపోయిన Byju’s Founder Net worth
బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. కరోనా సమయంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత పెరగడం వలన బైజూస్ సంస్థ ఓ వెలుగు వెలిగింది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో బ్రాంచులు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది. ఆ సమయంలో బైజూస్ స్టాక్స్ విలువలు కూడా భారీగా పెరగడంతో అతనికి ఇక తిరుగులేదని అందరూ భావించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రన్(Ravindran) నెట్‌వర్త్ విలువ 17,545 కోట్లకు చేరుకుంది.
సంవత్సరం క్రితం ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ EdTech సంస్థగా పేరుగాంచిన బైజూస్.. వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు విస్తరించింది. ఎక్కడపడితే అక్కడ ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంది. దీంతో బైజుస్‌పై మనీలాండరింగ్(money laundering) కేసు నమోదైంది. మనీలాండరింగ్ ఆరోపణలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొని వరుసగా నష్టాలను చవిచూసింది. దీనితో బైజూస్ వ్యవస్థాపకుడి నెట్ వర్త్(Byju’s Founder Net worth) విలువ ఒక్కసారిగా 17 వేల కోట్ల నుంచి సున్నాకి మారిపోయిందని ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్(Forbes Billionaires Index) ప్రకటించింది.
ఇక ఇప్పుడు బైజుస్ సంస్థ ఉద్యోగుల్నిపెద్ద మొత్తంలో తొలగించింది. మిగిలివున్న ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. బోర్డు సభ్యులు వరుసగా రాజీనామాలు చేశారు. బైజూస్ నుంచి రవీంద్రన్‌ను తప్పించాలన్న డిమాండ్లు వచ్చాయి. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య బైజూస్ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా కార్యాలయాలను మూసేసింది.
-By VVA Prasad