
Ram Mandir Event పై చిరంజీవి ట్వీట్
చరిత్ర సృష్టిస్తోంది
చరిత్రను ఉర్రూతలూగిస్తోంది
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొతుంది
ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి…’’ అంటూ చిరంజీవి (Chiranjeevi) ఆనందోత్సహంతో ట్వీట్ చేశారు.
అయోధ్య రామమందిరంలో(Ayodhya Ram Mandir) బాలరాముడి (Bala ramudu)ప్రాణ ప్రతిష్ఠకు తనకు ఆహ్వానం అందడం, రేపు ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ ట్వీట్ చేశారు.
ఈ ఆహ్వానాన్ని అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడాన్ని చూడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను.
ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఈ మహత్తర అధ్యాయం.
ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. 🙏
నిజంగా వర్ణించలేని అనుభూతి.
నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీ జీ ఈ గౌరవాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు.
అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు.
ఈ మహత్తర సందర్భం(Ram Mandir Event)లో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. జై శ్రీ రామ్’’ అని చిరంజీవి ట్విట్టర్ (X )లో పేర్కొన్నారు.
జై శ్రీ రామ్! 🙏🙏
Creating history
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024
Evoking history
Everlasting in History
This is truly an overwhelming feeling..
I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya.
That glorious chapter, when the excruciating wait of generations of Indians…