
Delhi CM Kejriwal కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. బిగ్ షాక్..
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్(Delhi CM Kejriwal) ను తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ కస్టడీలోకి తీసుకున్న కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఏం చట్టంలోనైనా ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశం కోర్టు పరిధిలోకి రాదని.., ఈ విషయం రాజకీయాలకు ముడిపడి ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ లా వర్క్ ఫ్రమ్ జైల్ చేసుకోవచ్చు.. బిగ్ రిలీఫ్ అని అనుకుని ఆనంద పడే లోపే రూస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue court) ఆయనకు కస్టడీ పొడిగించి బిగ్ షాక్ ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్ పాస్ వర్డ్ లను ఆయన చెప్పడం లేదని.. అందులో కీలకమైన సమాచారం ఉందని.. ఆ ఫోన్లను ఫారెన్సీక్ కు పంపినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. మరింత సమాచారం రాబట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. సీఎం కేజ్రీవాల్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు.. కోర్టు షాక్ ఇచ్చింది.
-By VVA Prasad