
Byjus Delayed Salaries
వరుసగా మార్చి నెలలో కూడా ఉద్యోగులకు జీతాలను ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుందని చెప్పడానికి బాధపడుతున్నామని బైజూస్ కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 8 నాటికి జీతాలు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు బైజూస్ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలను సైతం ఉద్యోగులకు కంపెనీ మార్చి మధ్య వరకు ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బకాయిల్లో కొంత భాగాన్ని చెల్లించింది.
కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి చివర్లో రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను ఉపయోగించకుండా నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని కంపెనీ లేఖలో వివరణ ఇచ్చింది.
-By VVA Prasad