Padma Vibhushan Chiranjeevi
చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిరంజీవిని పద్మ విభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. నేడు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవిని వరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ (మే 9న) దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం పద్మ విభూషణ్‌ను అందుకున్నారు. కాగా ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి Chiranjeevi నిన్న భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడల ఉపాసనతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి పద్మ విభూషణ్ అందుకుంటున్న క్రమంలో రామ్ చరణ్ ఎమోషల్ అవుతూ కనిపించాడు.
Hearty Congratulations to Shri Konidela Chiranjeevi garu on being conferred Padma Vibhushan by Hon’ble President Smt Droupadi Murmu, today at Rashtrapati Bhawan in New Delhi.
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 9, 2024
This is a befitting honour to Sri Chiranjeevi Garu who has contributed immensely to Telugu & Indian… pic.twitter.com/C4imFzHxjr