Equity Power: 30 ఏళ్ల క్రితం రూ 500/- పెట్టి SBI షేర్లు కొన్న తాత.. ఇప్పటి విలువ చూసి షాక్ తిన్న మనవడు!

Share the news
Equity Power: 30 ఏళ్ల క్రితం రూ 500/- పెట్టి SBI షేర్లు కొన్న తాత.. ఇప్పటి విలువ చూసి షాక్ తిన్న మనవడు!

ఛత్తీస్‌గఢ్‌లో పీడియాట్రిక్ సర్జన్ అయిన తన్మయ్ మోతీవాలా 30 ఏళ్ల క్రితం తన తాత రూ 500/- పెట్టి కొన్న SBI షేర్ల ఇప్పటి విలువ చూసి ఆశ్చర్య పోయాయాడు. తన్మయ్ తన కుటుంబ ఆస్తుల వివరాలను ఒక చోట చేస్తున్నప్పుడు, అతను ఆనందకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నాడు. అతని ప్రకారం, వాళ్ళ తాత గారు 1994లో రూ. 500 విలువైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లను కొనుగోలు చేశారట.

ఆ విషయాన్ని తన తాతలు చాలా కాలంగా మరిచిపోయారని మోతీవాలా చెప్పారు. అతను చెప్పిన దాని ప్రకారం, ఆ షేర్ల విలువ ఇప్పుడు రూ. 3.75 లక్షలు, అంటే ఆ షేర్లు అతనికి 30 ఏళ్లలో దాదాపు 750 రెట్లు రిటర్న్ ఇచ్చాయి అన్నమాట. ఈక్విటీ పవర్ తెలుసు కాబట్టే మా తాతలు 1994లో రూ. 500 విలువైన SBI షేర్లను కొనుగోలు చేశారు అని అంటున్న తన్మయ్. కుటుంబం యొక్క హోల్డింగ్‌లను ఒక చోటుకు చేరుస్తున్నప్పుడు తన్మయ్ అలాంటి కొన్ని సర్టిఫికేట్‌లను కనుగొన్నాడు. ఇప్పుడతను వాటిని మనుగడలోకి తేవడానికి డీమ్యాట్‌కి మార్చడానికి ప్రయతిస్తున్నాడు.

See also  Arava Sridhar: రైల్వేకోడూర్‌ జనసేన అభ్యర్థి గా అరవ శ్రీధర్

ఒక వేళ వాళ్ళ తాతలు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే, ఇప్పుడవి 7.5 కోట్లు అయ్యేవి 😎😃

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top