
హైజాక్ కాబడిన Iranian fishing vessel ను రక్షించిన Indian Navy!
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సమీపంలో ఇరాన్ మత్స్యకార నౌకపై(Iranian fishing vessel) సముద్రపు దొంగల దాడిపై భారత నావికాదళం వేగంగా స్పందించిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. గంటల తరబడి జరిగిన ప్రతి దాడి తరువాత సముద్రపు దొంగలు(Pirates) భారత నావికాదళం కు లొంగిపోయారు. దానితో ఇరాన్ ఫిషింగ్ ఓడ ‘ఏఐ కంబార్ 786′(Al Kambar 786)లో సిబ్బంది గా వున్న 23 మంది పాకిస్తానీ పౌరులు రక్షించబడ్డారు .
మార్చి 28 సాయంత్రం ఇరాన్ ఫిషింగ్ ఓడ ‘అల్ కంబార్ 786’లో సముద్రపు దొంగల సంఘటన గురించి నేవీకి సమాచారం అందింది. హైజాక్ చేయబడిన ఫిషింగ్ ఓడను అడ్డుకునేందుకు సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం అరేబియా సముద్రంలో మోహరించిన రెండు నౌకలను మళ్లించడం ద్వారా నావికాదళం వేగంగా స్పందించింది. “సంఘటన జరిగిన సమయంలో ఫిషింగ్ ఓడ, సోకోట్రాకు దాదాపు 90 నాటికల్ మైళ్ళ దూరంలో నైరుతి దిశలో ఉంది మరియు తొమ్మిది మంది సాయుధ సముద్రపు దొంగలు దానిలో ఉన్నట్లు తెల్సింది.
సొకోత్రా ద్వీపసమూహం వాయువ్య హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సమీపంలో ఉంది. ఇటీవలి నెలల్లో, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సమీపంలో వ్యాపార నౌకలపై దాడులు పెరగడంతో భారత నావికాదళం తన నిఘాను పెంచింది. జనవరి 5న, సోమాలియా తీరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన లైబీరియన్ జెండాతో కూడిన ఓడ MV లీలా నార్ఫోక్‌ను భారత నావికాదళం రక్షించింది. మార్చి 23న, నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితమైనది గా చేయడానికి గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.