తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

Share the news
తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

K-CET 2024 తొలిరోజే గందరగోళం!

బెంగళూరు(Bengaluru): ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్’ (K-CET 2024) తొలిరోజే గందరగోళం సృష్టించింది. ద్వితీయ సంవత్సరం పీయూసీ పాఠ్య పుస్తకం నుంచి తొలగించిన అధ్యాయానికి సంబంధించి బయాలజీ లో 11 ప్రశ్నలు, గణితంలో 9 ప్రశ్నలు అడిగారని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు, లెక్చరర్లు తెలిపారు. అలాగే పాఠ్యేతర ప్రశ్నలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన విద్యాసంస్థల అధినేతలు కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీకి (KEA) లేఖ రాసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గురువారం జరిగిన K-CET 2024 పరీక్షలో బయాలజీ, మ్యాథమెటిక్స్ లలో సిలబస్లో లేని 20 ప్రశ్నలు అడిగారు. దీంతో విద్యార్థులు షాక్ తిన్నారు. నేను KEA కి కాల్ చేయగా.. వారు గ్రేస్ మార్కులు ఇవ్వలేమని చెప్పారు. – నరేంద్ర.ఎల్. నాయక్, చైర్మన్, Expert PU కళాశాల, మంగళూరు.

See also  Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి!

ఇద్దరికీ ఒకే రిజిస్ట్రేషన్ నంబర్!
సీఈటీ పరీక్ష జరిగిన కలబురగిలోని ముక్తాంబిక ఇండిపెండెంట్ పీయూ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. అయితే పరీక్షా కేంద్రం ఇన్ చార్జి సమస్యను పరిష్కరించి ఇద్దరు విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు తెలిసింది.

నేడు (శుక్రవారం) ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ లలో పరీక్ష నిర్వహించనున్నామని, అన్ని సన్నాహాలు పూర్తి చేశామని కేఈఏ తెలిపింది. కాగా.. బయాలజీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నపత్రాల్లో పాఠ్యేతర ప్రశ్నలు అడిగారన్న ఫిర్యాదులపై స్పందించిన KEA ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ S. రమ్య ఆన్సర్ కీ ని శనివారం విడుదల చేస్తామని, దానిపై అభ్యంతరాలు తెలియజేస్తే సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలించి ఇచ్చిన సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని, చెప్పారు.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top