
Modi Cabinet స్వరూపం
పాతవారిపై పూర్తి నమ్మకం.. కొత్త మిత్రులకు కూడా ప్రాధాన్యం.. ఆపై మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్(Modi Cabinet ) స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
ఇక బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రసాయనాలు, ఫర్టిలైజర్స్‌తో కలిపి వైద్య శాఖ ఇచ్చారు. రైల్వేను అశ్విని వైష్ణవ్ వద్దే ఉంచుతూ.. ఐటీ, సమాచార, ప్రసార, ఎలకా్ట్రనిక్స్ శాఖలను జోడించారు. జ్యోతిరాదిత్య సింథియాను మాత్రం పౌర విమానయానం నుంచి టెలికాంకు మార్చి.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధినీ కట్టబెట్టారు. భూపేంద్ర యాదవ్ మరోసారి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను చూడనున్నారు. జల్‌శక్తి శాఖను సీఆర్ పాటిల్‌కు కేటాయించారు. బీజేపీకే చెందిన హర్దీప్‌సింగ్ పురీ, మన్‌సుఖ్ మాండవియాకూ మంచి శాఖలే లభించాయి. ఒడిసాకు చెందిన జుయల్ ఓరమ్‌కు గిరిజన వ్యవహారాలను కేటాయించారు. ఇక మిత్రపక్షాల్లో TDP యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడికి పౌర విమానయానం, జేడీయూ నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య, పశు సంవర్ధకం దక్కాయి.
Full Cabinet