
గుజరాత్ -గాంధీనగర్ లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ (Vibrant Gujarat Summit) లో పాల్గొన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani ), PM Modi ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా వున్న సమకాలిక నాయకులలో ఎవరు కూడా నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకులు లేరు అని ప్రస్తుతించారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మన దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావశీలుడైన, సమర్థవంతమైన PM Modi అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కొనియాడారు. రెండు దశాబ్దాల క్రితం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో మొదలు పెట్టిన ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ (Vibrant Gujarat Summit) కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్టర్ సమ్మిట్ గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
Most efficient PM Modi
“మన ప్రియతమ నేతగా భారతీయుల మనసులను గెలుచుకున్న నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రపంచంలో గొప్ప నాయకుడిగా రూపొందారని ముకేశ్ అంబానీ అభివర్ణించారు. మన PM Modi మాట్లాడితే యావత్ ప్రపంచం వినడమే కాదు..ఆ ప్రసంగాలకు ప్రశంసలందుతున్నాయని పేర్కొన్నారు. విదేశాల్లో వున్న తన మిత్రులు కొందరు ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ అనే నినాదానికి అర్థమేమిటని అడిగారని, దానికి నేను వివరించిన అర్థం – భారత ప్రధాని తన పట్టుదల, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని చెప్పానని అక్కడి సభికులకు తెలియజేశారు. నవీన భారతం అనేది కేవలం మోదీ వల్లే సాధ్యమైంది అని తన అభిప్రాయాన్ని తెలిపారు అంబానీ. రాబోయే తరాల వారందరూ మన మోదీకి రుణపడి ఉంటారని, ప్రధానిపై అంబానీ (Mukesh Ambani) ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ దశాబ్దంలో దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రపంచస్థాయి ప్రాజెక్టులను ఎన్నో నిర్మించడం జరిగిందని, వీటిలో మూడో వంతు గుజరాత్ లోనే నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)’ ఎప్పటికీ గుజరాతేనని ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. ఇంతకు ముందే జామ్ నగర్ లో 500 ఎకరాల్లో ‘ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్’ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీనిద్వారా హరిత ఇంధన ఉత్పత్తిలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా గుజరాత్ హరిత ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా అవతరిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కాంప్లెక్స్ 2024 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఇపుడు కొత్తగా దేశంలోనే తొలి ప్రపంచ స్థాయి కార్బన్ ఫైబర్ ఫెసిలిటీని గుజరాత్ లోని (Gujarat) హజీరాలో ఏర్పాటు చేస్తామని అంబానీ (Mukesh Ambani) ప్రకటించారు. 2047 నాటికి మన దేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశాలు పుష్కలంగా వున్నాయని ముకేశ్ అంబానీ అన్నారు. ఇందులో ఒక్క గుజరాత్ రాష్ట్రమే మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంచనా వేస్తున్నానన్నారు.ఇది ముమ్మాటికీ జరిగి తీరుతుందని అన్నారు.
గుజరాత్ కు పెట్టుబడుల వెల్లువ
వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో (Vibrant Gujarat Summit) భాగంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించగా, ఇతర అనేక కంపెనీలు గుజరాత్ లో తమ, తమ పెట్టుబడుల ప్రణాళికల వివరాలను ప్రకటించాయి
-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist