
Most Popular CMs: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం ఎవరు? ఆయా రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరు?దీని మీద ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ (MOTN ) లో భాగంగా ఓ సర్వే నిర్వహించి, ఎవరు మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని తేల్చి అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్ 5 సీఎంల జాబితాను విడుదల చేసింది. కానీ ఇందులో మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోవడం గమనార్హం.
Popular CMs
ఆయా రాష్ట్రాల్లో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రుల(Popular CMs) జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnaik) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నిలిచారు. మూడో స్థానంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఐదో స్థానంలో త్రిపుర సీఎం మాణిక్ సాహా ఉన్నారు.
ఇక పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(46.3 శాతం) మొదటి స్తానం పొందారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(19.6 శాతం). మొదటి రెండు స్థానాలకు దాదాపు 26 శాతం తేడా వుంది. ఇక మిగతా స్థానాల్లో వరుసగా మమతా , స్టాలిన్, నవీన్ పట్నాయక్ ఉన్నారు.
అంతా బాగానే ఉంది కానీ ఈరెండు జాబితాల్లో మన తెలుగు రాష్ట్రాల సీఎంలు లేకపోవడమే ఆశ్యర్యకరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే వచ్చారు కాబట్టి ఓకే. కానీ జగన్ మోహన్ రెడ్డి లేకపోవడం గమనించ దగ్గ విషయం. ఎక్కడా లేని విదంగా సంక్షేమ పధకాలు ఇస్తున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి మొదటి మొదటి 5 స్థానాల్లో లేకపోవడంమేమిటో? ఎక్కడో తేడా కొడుతోంది. సరైన పరిపాలన లేకపోవడం, అభివృద్ధికి ఆమడ దూరం, ప్రత్తిపక్షాల పై కక్షసాధింపు ధోరణి ఇవన్నీ కలిపి ఆయన ప్రజాధారణ కోల్పోయేలా చేసి ఉండవచ్చు. ఇంకా రెండు నెలలు ఓపిక పడితే ఎంత ప్రజాదరణ ఉందో తెలిసిపోతుంది.