
NEET-PG Entrance 2024 వాయిదా!
దేశవ్యాప్తంగా ఈ రోజు (జూన్ 23)న జరగవలసిన నీట్-పీజీ ఎంట్రెన్స్(NEET-PG Entrance 2024 ) ఎగ్జామ్‌ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎగ్జామ్ జరగడానికి కొన్ని గంటల ముందుగా శనివారం రాత్రి వెల్లడించింది.
NEET-యూజీ, యూజీసీ-నెట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా NEET-PG ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది.
అయితే ఉదయం 7 గంట్లకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవలసిన దృష్ట్యా వేరే ప్రదేశాలకు శనివారం రాత్రికల్లా చేరుకున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ పరీక్ష కోసం హైదరాబాద్ లో ఉన్న విద్యార్ధులకు సైతం.. కరీంనగర్, వరంగల్ వంటి ఇతర ప్రదేశాలలో సెంటర్లు కేటాయించడం గమనార్హం.
NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ పై వేటు
దిద్దుబాటు చర్యలలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చీఫ్‌గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్‌ను కేంద్రం ఆదివారం ఉదయం తొలగించింది. ఆయన స్థానంలో కర్ణాటక కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా నియమించింది