2024కు గాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
5 గురికి పద్మ విభూషణ్.. 17 మందికి పద్మభూషణ్.. 110 మందికి పద్మశ్రీ
చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్
తెలుగు రాష్ట్రాల నుంచి 6 గురికి పద్మాలు
ఏపీ నుంచి హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి,
తెలంగాణ నుంచి కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విఠలాచార్య,
దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందాచారికి పద్మశ్రీ
తమిళ నటుడు విజయ్‌కాంత్‌కు మరణానంతరం పద్మభూషణ్
Padma Awardees 2024
2024కు గాను పద్మ పురస్కారాలను(Padma Awardees 2024) కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. ఎలాంటి నేపథ్యమూ లేకుండా అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి, తమ తమ రంగాల్లో అద్భుతమైన ప్రతిభతో అత్త్యున్నతమైన స్థానానికి ఎదిగిన ఇద్దరు తెలుగు తేజాలను ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం వరించింది! వారిలో ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య(Venkaiah Naidu).. మరొకరు చిరంజీవి(Chiranjeevi). చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెల్సిందే. సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలకు గాను ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటిస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమైయ్యాయి. ఇకపోతే పద్మభూషణ్ కేటగిరీలో తెలుగువారు ఎవరూ లేరు.
Padma Awardees 2024: పద్మవిభూషణ్‌ల స్పందన
𝐓𝐫𝐮𝐥𝐲 𝐡𝐮𝐦𝐛𝐥𝐞𝐝 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐡𝐨𝐧𝐨𝐮𝐫 𝐨𝐟 𝐏𝐚𝐝𝐦𝐚 𝐕𝐢𝐛𝐡𝐮𝐬𝐡𝐚𝐧 award 𝐜𝐨𝐧𝐟𝐞𝐫𝐫𝐞𝐝 𝐮𝐩𝐨𝐧 𝐦𝐞. As I continue to serve the people after my tenure as the Vice President of India, this honour makes me even more conscious of my role in the national…
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 25, 2024
🙏🙏🙏 pic.twitter.com/QAfqE5Rk1G
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2024
ఇక పద్మశ్రీ పురస్కారాలు.. తెలంగాణకు చెందిన ఐదుగురికి, ఏపీకి చెందిన ఒకరికి దక్కాయి. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనవారిలో.. జనగాం ప్రాంతానికి చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట్ జిల్లా దామెరగిద్ద గ్రామానికి చెందిన ప్రముఖ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, తనకు మిగిలిన ఏకైక ఆస్తి అయిన ఇంటిని గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలను సమకూర్చిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, బంజారా జాతి జాగృతం కోసం పాటుపడుతున్న కేతావత్ సోమ్‌లాల్, యాదాద్రి సహా పలు ఆలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ స్థపతి వేలు ఆనందాచారి ఉన్నారు. అలాగే.. ఏపీకి చెందిన ప్రముఖ హరికథా కళాకారిణి, దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన డి.ఉమామహేశ్వరికి కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఇక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలుగేతర ప్రముఖుల్లో.. రోహన్ బోపన్న, జోత్స్న చిన్నప్ప వంటివారు ఉన్నారు.
Padma Awardees 2024: పద్మవిభూషణ్ గ్రహీతలు..
పద్మవిభూషణ్ పురస్కారాలు లభించిన వారిలో వెంకయ్య నాయుడు, చిరంజీవితోపాటు.. తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతీ మాల బాలి, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్ శౌచాలయ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (మరణానంతర పురస్కారం) ఉన్నారు
Padma Awardees 2024: పద్మభూషణ్ గ్రహీతలు..
ఇక, పద్మభూషణ్ లభించిన వారిలో.. ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ గాయని ఉషా ఉతప్, తమిళ నటుడు విజయ్‌కాంత్ (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి సత్యవ్రత ముఖర్జీ (మరణానంతరం), ప్రముఖ సంగీత దర్శకుడు ప్యారేలాల్, ప్రముఖ వ్యాపారవేత్త సీతారామ్ జిందాల్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ జర్నలిస్టు హోమ్‌సజీ ఎన్ కామా, తైవాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఫాక్స్‌కాన్ గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ, సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జిగా నియమితురాలైన ఎం.ఫాతిమా బీవి (మరణానంతరం), ప్రముఖ గుండె వైద్య నిపుణులు అశ్విన్ బాలచంద్ మెహతా, తేజస్ మధుసూదన్ పటేల్, యూపీ మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, తేజస్ మధుసూదన్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి ఓలంచేరి రాజగోపాల్, దత్తాత్రేయ అంబాదాస్ మయాలు, తోగ్దాన్ రిన్‌పోచే (మరణానంతరం), కేంద్ర మాజీ మంత్రి చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, కుందన్ వ్యాస్ ఉన్నారు
ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. ఇక దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బీహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ థాకూర్ (మరణానంతరం) ప్రకటించిన సంగతి తెల్సిందే.
Padma Awardees 2024 full List here: