
Anacondas Smuggling
బెంగళూరు: బెంగళూరు(Bengaluru)లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరినీ షాక్ కు గురి చేసే సంఘటన చోటు చేసుకుంది. 10 అనకొండలను స్మగ్లింగ్ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ బ్యాగేజీని తనిఖీ చేయగా అందులో తెల్ల కవర్లలో చుట్టిన 10 పసుపు రంగు అనకొండలు బయటపడ్డాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
-By VVA Prasad