
AP Cabinet
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) బుధవారం (జూన్ 12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా మరియు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో(AP Cabinet) మొత్తం 24 మందికి చోటు కల్పించారు. మంత్రుల్లో మిత్ర పక్షాల నేతలకు కూడా సమన్యాయం పాటిస్తూ మంత్రి పదవులను కేటాయించారు. మొత్తం మంత్రుల్లో టీడీపీకి(TDP) 21, జనసేనకు(Janasena) 3, బీజేపీకి(BJP) ఒక్క మంత్రి పదవి కేటాయించారు. డిప్యూటీ సీఎం గా జనసేన పవన్ కల్యాణ్ అని ప్రచారం జరగడం తెలిసిందే. డిప్యూటీ సీఎం గా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉండనున్నారు.
ఏపీలో కొత్త మంత్రుల జాబితా..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పి. నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, ఎన్.ఎమ్.డి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎస్.సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
మొత్తం 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. వీరిలో ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఇక పోతే బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీ నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దొరికింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు.

Full Cabinet