PM Modi Ayodhya visit
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను 30 డిసెంబర్ 2023న సందర్శిస్తారు . ప్రధాన మంత్రి సుమారు ఉదయం 11:15 సమయంలో పునర్నిర్మాణం చేసిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మరియు నూతన అమృత్ భారత్ రైళ్లు మరియు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభం చేయనున్నారు. రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించడం తో దేశంలో అమృత్ భారత్ రైళ్ల కార్యకలాపాలు ఆరంభం అవుతాయి.
ఇక్కడి నుండి ప్రధాని అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం సుమారు 12:15 గంటలకు, కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 1 గంటలకు ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో రూ. 15,700 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించి, శంకుస్థాపనచేసి జాతికి అంకితం చేస్తారు . వీటిలో అయోధ్య మరియు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు మరియు ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.
అయోధ్యలో ఆధునిక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం,అనుసంధాన్ని మెరుగుపరచడం మరియు నగరం యొక్క గొప్ప చరిత్ర మరియు వారసత్వానికి అనుగుణంగా దాని పౌర సౌకర్యాలను పునరుద్ధరించడం పై ప్రధానమంత్రి దృష్టి సారించారు .ప్రధాన మంత్రి వీటితో పాటు మరో ఆరు వందే భారత్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు . వీటిలో శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా -న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; అమృత్‌సర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; కోయంబత్తూరు-బెంగళూరు కాంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; మంగళూరు- మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; జల్నా -ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు అయోధ్య -ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లు ఉన్నాయి .
@సురేష్ కశ్యప్