President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!?

Share the news
President rule in Delhi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన…!?

President rule in Delhi?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal Arrest) అయి రోజులు గడుస్తున్నాయి. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. తాను చేయను అని అంటున్నారు. ఆప్ మంత్రులు కూడా అదే చెబుతున్నారు. తమ నాయకుడు జైలు నుంచి పాలిస్తారు అని వారు అంటున్నారు. అన్యాయంగా ఆయనను జైలులో పెట్టారని అంటున్నారు. తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజురోజుకు కేజ్రీవాల్ అవకాశాలు తగ్గిపోతున్నాయి.

ఈ నేపధ్యంలో కేంద్రం మరో స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఈ రోజుకు చూస్తే ఢిల్లీలో పాలన అయితే స్థంభించింది అని అంటున్నారు. సీఎం జైలు లో ఉన్నారు. కొత్త నేతను ఎన్నుకోలేదు. ఒక విధంగా రాజ్యాంగ ప్రతిష్టంబన ఏర్పడింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జైలు నుంచి పాలన ఉండదని వ్యాఖ్యానించారు. ఇది అతి పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యల వెనక రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశ్యం ఉందని ఆప్ మంత్రులు అంటున్నారు. దాంతో వారంతా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వాఖ్యలను తప్పుపడుతున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన(President rule in Delhi) విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి అన్నారు.

See also  Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఒకే రోజు బిగ్ రిలీఫ్.. & బిగ్ షాక్..

ఆమె పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎవరైనా దోషిగా తేలితేనే అలాంటి చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ఉందని గుర్తు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగ నిబంధనను ఉదహరిస్తున్నారని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను(President rule in Delhi) ఎలా విధిస్తారు అని కూడా ఆమె ప్రశ్నించారు. పాలనకు అవకాశాలు లేని సందర్భంలోనే రాష్ట్రపతి పాలన విధించవచ్చని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్నారు. ఇక తమకు ఢిల్లీ శాసన సభలో పూర్తి మెజారిటీ ఉన్న సమయంలోనూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రతీకార చర్య అవుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 356 అంశం సుప్రీంకోర్టుకు పలుమార్లు వెళ్లిందని ఎన్నోసార్లు వ్యతిరేక తీర్పులు వచ్చాయని ఆమె గుర్తు చేస్తున్నారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్(Kejriwal) నిర్దోషి అని తేలాలంటే న్యాయ ప్రక్రియ చాలానే జరగాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లోగా ఆయన బెయిల్ మీద బయటకు వస్తే సరేసరి. మరిన్నాళ్ళు జైలులో ఉంటే మాత్రం రాష్ట్రపతి పాలనకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రం ఢిల్లీ రాజకీయాలలో కాక రేపుతోంది. ఆయన లేకుండానే ఎన్నికలు ముగుస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

See also  Blast in Bengaluru Cafe: బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు, CCTV లో బ్యాగ్‌ పెడుతూ కనిపించిన వ్యక్తి!

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top