Rajasthan CM Bhajan Lal Sharma: బీజేపీ సంచలన నిర్ణయం

Rajasthan CM Bhajan Lal Sharma: రాజస్థాన్ లో సంచలనం. తొలిసారి MLA గా గెలిచిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తూ బీజేపీ అనూహ్య నిర్ణయం.
Share the news
Rajasthan CM Bhajan Lal Sharma: బీజేపీ సంచలన నిర్ణయం

Rajasthan CM Bhajan Lal Sharma: రాజస్థాన్ లో సంచలనం. తొలిసారి MLA గా గెలిచిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తూ బీజేపీ అనూహ్య నిర్ణయం. జైపూర్ లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Rajasthan CM Bhajan Lal Sharma

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ (Rajasthan CM Bhajan Lal Sharma)ను బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజే.. భజన్ లాల్ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. దాంతో రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు తొమ్మిది రోజుల తర్వాత రాజస్థాన్ సీఎం పేరు ఖరారుచేశారు..

ఇద్దరు నేతలను ఉప ముఖ్యమంత్రులగా ప్రకటించారు. దియా సింగ్, డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వాలు రాజస్థాన్ Deputy CM లని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నేత రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. వాసుదేవ్ దేవ్‌నానీ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

See also  బీజేపీలోకి BRS కీలక నేతలు.. బీఆర్ఎస్‌ కారు ఇక షెడ్డు కెళ్లేలా ఉంది!

భజన్ లాల్ శర్మ వయసు 56 ఏళ్లు కాగా, ఆయన జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి తొలిసారి MLA గా గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల భారీ తేడాతో భజన్ లాల్ విజయం సాధించారు.

Also Read News

Scroll to Top