Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి..

Share the news
Siddhi Mishra: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి..

ఎవరెస్టు శిఖరం పై రెండేళ్ల చిన్నారి Siddhi Mishra

భోపాల్: మధ్య ప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన సిద్ధి మిశ్రా(Siddhi Mishra) అనే చిన్నారి రెండేళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన చిన్నారిగా రికార్డు సాధించింది. ఈ చిన్నారిని తీసుకుని ఆమె తల్లి భావన దేహరియా(Bhavna Dehariya), తండ్రి మహిమ్ మిశ్రా(Mahim Mishra) దాదాపు పది రోజులు ట్రిక్కింగ్ చేసి ఈ నెల (march) 22వ తేదీన ఎవరెస్టు బేస్ క్యాంప్(Everest Base Camp) వరకు వెళ్ళడం విశేషం.

ఈ మేరకు మంగళవారం ఓ ప్రైవేట్ ట్రక్కింగ్ కంపెనీ ‘ఎక్స్‌పెడిషన్ హిమాలయ'(Expedition Himalaya) విడుదల చేసిన ప్రకటనలో ధృవీకరించబడింది. ‘ఎక్స్‌పెడిషన్ హిమాలయ’ మేనేజింగ్ డైరెక్టర్ నబిన్ ట్రిటిల్ మాట్లాడుతూ, సిద్ధి కుటుంబం మార్చి 12న లుక్లా నుండి ప్రయాణానికి బయలుదేరిందని, పది రోజుల తర్వాత వారు తమ లక్ష్యాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఈ ప్రయాణం ఎవరెస్ట్ యొక్క ఈశాన్య అంచున ఉన్న లుక్లా నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది.

See also  Iranian President Ebrahim Raisi: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్నహెలికాప్టర్‌!

దీనితో సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్క్యాంపుకు చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా సిద్ది మిశ్రా రికార్డులకెక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ పూనే కు చెందిన 6 సంవత్సరాల అరిష్కా లద్దా(Arishka Ladda) అనే పాప పేరున ఉండేది. ఈ పాప 2023, ఏప్రిల్ నెలలో ఈ ఘనత సాధించింది.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top