Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్!

కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్(Cocaine Capsules) తో దొరికిపోయిన పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశానికి చెందిన వ్యక్తి .
Share the news
Cocaine Capsules: సినిమా ఫక్కీలో స్మగ్లింగ్… కడుపులో 11 కోట్ల కొకైన్ క్యాప్సూల్స్!

కడుపులో 11 కోట్ల Cocaine Capsules

ముంబై: ముంబై విమానాశ్రయంలో సినిమా ఫక్కీలో స్మగ్లింగ్ సీన్ చోటు చేసుకుంది. రోజువారి తనఖీల్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశానికి చెందిన వ్యక్తిపై అనుమానంతో స్కానింగ్ చేసి చూడగా… అతని కడుపులో పెద్ద ఎత్తున ఏవో క్యాప్సూల్స్ ను గుర్తించారు.

దీంతో.. మార్చి 28న Narcotic Drugs and Psychotropic Substances Act క్రింద ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం అతని కడుపు నుంచి 1,108 గ్రాముల బరువున్న 74 కొకైన్ క్యాప్సూల్స్(Cocaine Capsules) ను ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆస్పత్రి వైద్యుల బృందం శనివారం నాడు తొలగించిందని, వీటి విలువ రూ.11 కోట్లు ఉంటుందని DRI అధికారులు వెల్లడించారు.

-By VVA Prasad

See also  Election Code: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఉపేక్షించేది లేదన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేలా షారోన్!

Also Read News

Scroll to Top