Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..?

Share the news
Toll Gates System: త్వరలోనే టోల్ గేట్ల వ్యవస్థ మాయం..?

త్వరలో Toll Gates System వ్యవస్థ మాయం..?

ఇకపై దేశంలోని టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగాల్సిన పని లేకుండా నూతన వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు.

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను మారుస్తున్నట్లు, త్వరలో అధునాతన టెక్నాలజీతో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దీని కోసం ఇప్పుడున్న టోల్ గేట్ వ్యవస్థను(Toll Gates System) త్వరలో రద్దు పరిచనున్నారు. అనంతరం శాటిలైట్ బేస్‌డ్(Satellite-Based Toll System) టెక్నాలజీతో టోల్ సిస్టం అమల్లోకి వస్తుంది.

దీంతో వాహన యజమానులు హైవేపై ప్రయాణించేటప్పుడు.. జీపీఎస్ ఆధారంగా వారి బ్యాంకు ఖాతా నుంచి డైరెక్టుగా టోల్ వసూలు కానుంది. ఈ కొత్త సౌకర్యంతో ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద సమయం వృధా చేయాల్సిన పనిలేకుండా పోనుంది.

-By VVA Prasad

See also  Pavitra Jayaram Dies: రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ తెలుగు టీవీ నటి పవిత్ర జ‌య‌రాం (42) దుర్మరణం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top