Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..!

Share the news
Telugu Person as CS: అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) గా తెలుగు వ్యక్తి..!

అస్సాం ప్రభుత్వ CS గా తెలుగు వ్యక్తి(Telugu Person as CS)

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్. రవి కోట (అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి) అస్సాం స్టేట్(Assam State) 51వ సీఎస్(Telugu person as CS) గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శ్రీ పబన్ కుమార్ బోర్తకూర్ పదవీ విరమణ తేదీ (మార్చి 31) నుండి అమలులోకి వచ్చింది. ఈయన ప్రధాన కార్యదర్శి బాధ్యతతో పాటు, పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు ప్రత్యేక సెక్రటరీగా, అస్సాం(Assam) లోని చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా కూడా వ్యవహరిస్తారు. అస్సాం ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని తెలియచేసింది.

1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో Ph.D. చేసి గోల్డ్ మెడల్ సాధించారు. గతంలో, డాక్టర్ రవి పాస్‌పోర్ట్ మరియు జైళ్లతో సహా హోం మరియు రాజకీయ విభాగానికి అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర పరిపాలనా విభాగం నుంచి కేంద్ర స్థాయిలో ఆహారం మరియు వ్యవసాయం, మానవ వనరులు, పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అంతర్గత భద్రత వంటి అనేక రంగాలకు చెందిన పాలసీల రూపకల్పనలో ఈయనకు విశేష అనుభవం ఉంది.

See also  CBN Comments on Jagan: ఇంకొల్లు లో చంద్రబాబు కామెంట్స్

అస్సాంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో, డాక్టర్ కోటా Post-Planning Commission era, నోట్ల రద్దు మరియు GST అమలుతో సహా అనేక క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని 15వ ఫైనాన్స్ కమిషన్‌లో జాయింట్ సెక్రటరీగా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్థిక సమస్యలపై ఆయన పాత్ర ఎంతో మరువలేనిది. ఈయన గతంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల ఇండియన్ ఎంబసీలో ఆర్థిక శాఖకు అధిపతిగా వ్యవహరించారు.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top