Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ!

పేదలకు సబ్సిడీపై విస్కీ, బీర్(Whiskey and Beer) అందిస్తానని మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్ ప్రకటించారు.
Share the news
Subsidized Whiskey and Beer for the Poor: రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ!

పేదలకు సబ్సిడీపై Whiskey and Beer

చంద్రపూర్, మహారాష్ట్ర: తాను ఎంపీగా ఎన్నికైతే పేదలకు సబ్సిడీపై విస్కీ, బీర్(Whiskey and Beer) అందిస్తానని మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్(Vanita Raut) ప్రకటించారు.

మద్యం సేవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఇందుకోసం ఎంపీ ఫండ్‌ నుంచి నిధులను కేటాయిస్తానని, రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతినెలా రాయితీపై విస్కీ, బీర్లను అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కనీసం ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగానైనా రేషన్ కార్డుదారులకు విస్కీ, బీర్లను అందించాలన్నారు.

కాగా… ఆమె 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి, చిమూర్ అసెంబ్లీ స్థానం నుంచి మద్యపానంపై నిషేధాన్ని తొలగించాలనే డిమాండ్‌తో పోటీ చేసి ఓడిపోయారు. తాను గెలిస్తే ప్రతి గ్రామంలోని నిరుద్యోగ యువతకు మద్యం లైసెన్స్‌లు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. కనీసం ఈసారి ఎన్నికల్లోనైనా మందుబాబులు ఆమెకు అనుకూలంగా ఓటు వేస్తారో లేదో వేచిచూడాలి…

See also  Muslim Community: ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని భయానికి గురి చేస్తున్న వైసీపీ అభ్యర్థి గణేష్ పై మండిపడ్డ MLA అనగాని!

కొసమెరుపు: ఇంతమంది మగ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కనీసం ఒక్కడైనా ఇలాంటి హామీ ఇచ్చాడా? ఇప్పుడు ఒక ఆడకూతురు ఇలాంటి హామీ ఇచ్చింది. ఈసారి అక్కడ గెలిస్తే ఓకే, గెలవకపోతే మాత్రం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే బెటర్..😅😅

-By VVA Prasad

Also Read News

Scroll to Top