Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

Akash Deep: చాలామంది భారతీయుల్లానే చిన్నప్పటి నుంచి ఆకాశ్ దీప్ కల క్రికెటర్ కావాలనే. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో బాల్యంలో క్రికెట్ ఆడటం కుదర్లేదు. ఉద్యోగం కోసం వేరే ఊరెళ్లిన ఆకాశ్.. తన చుట్టాలబ్బాయితో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తర్వాత కుటుంబంలో విషాదాల కారణంగా మూడేళ్లపాటు ఆటకు దూరం. ,మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి.. రంజీల్లోకి, ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.
Share the news
Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?

రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు ద్వారా పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూనే అదరగొట్టే ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఫస్ట్ స్పెల్‌లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు. తన నాలుగో ఓవర్లో జాక్ క్రాలీని బౌల్డ్ చేసినప్పటికీ.. అది నోబాల్ కావడంతో ఆకాశ్‌ దీప్ కు నిరాశ ఎదురైంది. కానీ రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్(Akash Deep).. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో బెన్ డకెట్ (11), ఓలీ (0)ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే జాక్ క్రాలీ (42)ని కూడా బౌల్డ్ చేసాడు.

అసలీ ఆకాశ దీప్(Akash Deep) ఎవరు?

బిహార్‌లోని ససారామ్‌కు చెందిన ఆకాశ్ దీప్‌కు అందరిలానే చిన్నతనంలోనే క్రికెట్(Cricket) ఆడాలని ఉండేది. కానీ స్కూల్ టీచరైన తండ్రి కి ఇష్టం లేక పోవడంతో వెనక్కి తగ్గాడు. 2010 లో ఆకాశ్ దీప్ ఉద్యోగం కోసమని పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ వెళ్లాడు. కానీ అక్కడకు వెళ్లాక తన అంకుల్ నుంచి ఆకాశ్ దీప్‌కు సపోర్ట్ లభించింది. ఆయన కూడా తన కొడుకును క్రికెటర్ చేయాలనుకుంటున్నాడు.

See also  IND VS SA 3rd ODI: కుమ్మేసిన కుర్రోళ్ళు.. టీమిండియాదే ODI సిరీస్

ఇంకేముంది ఆకాశ్ దీప్(Akash Deep), అతడి కజిన్ కలిసి స్థానికంగా ఉండే క్రికెట్ అకాడమీకి వెళ్లి రోజు ప్రాక్టీస్ చేసేవాళ్లు. అలా ఆకాశ్ దీప్ తన పేస్‌కు మెరుగులు దిద్దుకున్నాడు. కానీ 2017లో ఆకాశ్ దీప్ తన తండ్రిని, రెండు నెలల తర్వాత పెద్దన్నయ్యను కోల్పోయాడు. రెండు నెలల వ్యవధిలోనే తండ్రిని, సోదరుణ్ని కోల్పోయిన ఆకాశ్ దీప్ మానసికంగా కుంగిపోయాడు. మరోవైపు తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో మూడేళ్లపాటు అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు.

మూడేళ్ల తర్వాత మరల క్రికెటర్(Cricketer) కావాలనే కోరికను సాకారం చేసుకోవడం కోసం మళ్లీ దుర్గాపూర్‌కు వెళ్ళాడు. ఆ తర్వాత కోల్‌కతాకు మకాం మార్చి చిన్న గదిలో తన కజిన్‌తో కలిసి ఉంటూ.. క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ తరువాత బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన యునైటెడ్ క్లబ్‌లో చేరాడు. ఆపై బెంగాల్ పేసర్ రణదేబ్ బోస్ సాయంతో బెంగాల్ అండర్ – 23 జట్టులో చేరాడు. ఆ సమయంలో వెన్ను నొప్పి ఆకాశ్ దీప్‌ను ఇబ్బంది పెట్టింది.. ఎంతగా అంటే తన కెరీర్‌ను ప్రమాదంలో పడేసేంతగా. కానీ బెంగాల్ అండర్-23 హెడ్ కోచ్ సౌరాశిష్ లాహిరి సాయంతో తిరిగి కోలుకున్నాడు.

See also  IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా?

ఇక 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసాడు. 30 ఏళ్ల తర్వాత బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ కల నెరవేరడానికి పేసర్లు ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్ లే కారణం. 2021 ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ ఆకాశ్‌ను ఎంపిక చేసుకుంది. 2022 IPL లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పడు బుమ్రా కి 4 వ టెస్ట్ లో రెస్ట్ ఇవ్వడం తో వచ్చిన అవకాశం ను ఆకాశ్ దీప్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఇక ఏకధాటిగా పది ఓవర్లపాటు ఒకే వేగంతో బౌలింగ్ చేయడం ఆకాశ్ దీప్ ప్రత్యేకత.

Also Read News

Scroll to Top